AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయ్ మాస్టర్ ప్లాన్.. ఒక్కొక్కరిని లాగుతూ ప్రత్యర్థులకు షాక్.. ఆ పార్టీలతో మాత్రమే పొత్తు..

తమిళనాడులో 2026 ఎన్నికలకు నటుడు విజయ్ పార్టీ టీవీకే సిద్ధమవుతోంది. విజయ్ సీఎం అభ్యర్థిగా ఆమోదించే పార్టీలతోనే పొత్తు ఉంటుందని స్పష్టం చేసింది. వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలు, మేనిఫెస్టో రూపకల్పన కోసం కమిటీలను నియమించారు. ఏడీఎంకే సీనియర్ నేతలను విజయ్ తన పార్టీలోకి ఆకర్షిస్తున్నారు. ఎన్నికల వ్యూహాలపై అత్యవసర సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

విజయ్ మాస్టర్ ప్లాన్.. ఒక్కొక్కరిని లాగుతూ ప్రత్యర్థులకు షాక్.. ఆ పార్టీలతో మాత్రమే పొత్తు..
Hero Vijay Political Strategy
Ch Murali
| Edited By: Krishna S|

Updated on: Dec 12, 2025 | 8:51 AM

Share

తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అందులోనూ ఇటీవల పార్టీని ఏర్పాటు చేసిన నటుడు విజయ్ మరింత స్పీడ్ పెంచారు. పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నిర్ణయాలకోసం కమిటీలను నియామకం జరిగింది. ఇందులో పార్టీ నేతలు కీలక తీర్మానం చేశారు.. తమిళనాడులో 2026 తొలి త్రైమాసికంలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు కొద్ది నెలలే ఉండడంతో రాజకీయ పార్టీలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి.

ఇప్పటిదాకా తమిళనాడులో డీఎంకే, ఏడిఎంకె రెండు పార్టీలే మార్చి మార్చి అధికారాన్ని సొంతం చేసుకుంటూ వస్తున్నాయి. ఇటీవల నటుడు విజయ్ సొంత పార్టీని ఏర్పాటు చేసి ఈసారి ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. గత మూడు నెలలుగా శని ఆదివారాలు ప్రజల్లోకి వెళ్లేందుకు వీకెండ్ టూర్ ఏర్పాటు చేసుకున్న విజయ్ ఆదిశగా వరుస సభలు నిర్వహించారు. అయితే కరూర్‌లో తొక్కిసలాటలు 41 మంది మృతి చెందడంతో సభలకు ఇచ్చే అనుమతి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. దీంతో టీవీకె పార్టీ స్పీడ్ కాస్త తగ్గింది. అయితే ప్రధాన పార్టీల నుంచి సీనియర్ లీడర్లను తమ వైపు తిప్పుకోవడంలో విజయ్ బాగా సక్సెస్ అయ్యారు.. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్నాడీఎంకెలో సీనియర్‌గా ఉన్న మాజీమంత్రి సెంగోట్టియన్, మరో సీనియర్ నేత నాంజల్ సంపత్ సహా పలువురు విజయ్ పార్టీలో చేరారు. ఏడీఎంకే నుంచి మరికొందరు సీనియర్ నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది.

ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రజల్లోకి వెళ్ళేందుకు మరింత వ్యూహాత్మకంగా విజయ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇవాళ చెన్నైలోని పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలు, కూటమి ఏర్పాటులో ఏఏ పార్టీ ఉండాలి అన్న అంశంపై నిర్ణయాలు.. ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఏ అంశాలు ఉండాలి.. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. అందుకోసం ఏర్పాటు చేసిన కమిటీలు వాటికి సంబంధించిన నివేదికలు సిద్ధం చేస్తాయి. విజయ్ సీఎం అభ్యర్థిగా అంగీకరించే పార్టీలతోనే పొత్తు ఉంటుందని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. ఎన్నికల్లో తమ మేనిఫెస్టోలో ఉండాల్సిన అంశాలపై కమిటీ నివేదిక రూపొందించాలని విజయ్ సూచించారు. ప్రచార కార్యక్రమాలు సభల విషయంలో అందుకోసం ఏర్పాటు చేసిన కమిటీ ప్రణాళికలను సిద్ధం చేయాల్సి ఉంటుంది..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..