AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శివరాజ్ పాటిల్ కన్నుమూత.. 7 సార్లు ఎంపీగా.. కేంద్ర హోంమంత్రిగా 26/11 ముంబై దాడుల సమయంలో..

Shivraj Patil: కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న 91 ఏళ్ల పాటిల్ శుక్రవారం ఉదయం మహారాష్ట్రలోని లాతూర్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

శివరాజ్ పాటిల్ కన్నుమూత.. 7 సార్లు ఎంపీగా.. కేంద్ర హోంమంత్రిగా 26/11 ముంబై దాడుల సమయంలో..
Shivraj Patil Passes Away
Krishna S
|

Updated on: Dec 12, 2025 | 9:26 AM

Share

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న 91 ఏళ్ల పాటిల్ శుక్రవారం ఉదయం మహారాష్ట్రలోని లాతూర్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతానికి చెందిన శివరాజ్ పాటిల్, లాతూర్ రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. ఆయన 1980 నుండి 2004 వరకు సుదీర్ఘంగా ఏడుసార్లు వరుసగా లాతూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1972 1978లో లాతూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కూడా ఆయన విజయం సాధించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో, ఆయన అనేక ప్రతిష్టాత్మక పదవులను నిర్వహించారు.

26/11 దాడుల సమయంలో హోంమంత్రి

శివరాజ్ పాటిల్ తన కెరీర్‌లో అత్యంత కీలకమైన పదవులలో ఒకటైన కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. అయితే 2008లో జరిగిన ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో ఆయన హోంమంత్రిగా ఉన్నారు. భద్రతా లోపాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న తర్వాత ముంబై దాడులను నిరోధించడంలో వైఫల్యాన్ని అంగీకరించి, నైతిక బాధ్యత వహిస్తూ పాటిల్ తన పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు ఆయన లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. లాతూర్ లోక్‌సభ నియోజకవర్గాన్ని ఏకధాటిగా ఏడుసార్లు గెలిచిన ఆయన ప్రస్థానం, 2004లో బీజేపీ అభ్యర్థి రూపతై పాటిల్ నీలంగేకర్ చేతిలో ఓటమితో ముగిసింది. దేశ రాజకీయాల్లో దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించిన శివరాజ్ పాటిల్ మరణం పట్ల మహారాష్ట్ర, కాంగ్రెస్ పార్టీ తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి.

పాటిల్ నేపథ్యం..

శివరాజ్ పాటిల్ 1935 అక్టోబర్ 12న లాతూర్ జిల్లాలోని చకూర్‌లో జన్మించారు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత ముంబై విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1963లో శివరాజ్ పాటిల్ చకుర్కర్, విజయ పాటిల్‌ను వివాహం చేసుకున్నారు. ఆయనకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. శివరాజ్ పాటిల్ కోడలు డాక్టర్ అర్చన పాటిల్ కూడా ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. శివరాజ్ పాటిల్ తన రాజకీయ జీవితాన్ని లాతూర్ మునిసిపల్ కార్పొరేషన్ నుండి ప్రారంభించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

సింగర్ అవ్వాలనుకుంది.. కట్ చేస్తే ఒక్క సిరీస్‌తో..
సింగర్ అవ్వాలనుకుంది.. కట్ చేస్తే ఒక్క సిరీస్‌తో..
రూ. 25 కోట్లతో లిస్టు చూస్తే కాటేరమ్మ గుర్తు రావాల్సిందే
రూ. 25 కోట్లతో లిస్టు చూస్తే కాటేరమ్మ గుర్తు రావాల్సిందే
శివరాజ్ పాటిల్ కన్నుమూత.. 7 సార్లు ఎంపీగా.. కేంద్ర హోంమంత్రిగా..
శివరాజ్ పాటిల్ కన్నుమూత.. 7 సార్లు ఎంపీగా.. కేంద్ర హోంమంత్రిగా..
గోల్డెన్ ప్లే బటన్ ఉన్న యూట్యూబర్ 1 సంవత్సరంలో ఎంత సంపాదిస్తాడు?
గోల్డెన్ ప్లే బటన్ ఉన్న యూట్యూబర్ 1 సంవత్సరంలో ఎంత సంపాదిస్తాడు?
ధోనిని తలపించిన జితేష్ శర్మ.. కళ్లుమూసి తెరిచేలోపే స్టంపింగ్
ధోనిని తలపించిన జితేష్ శర్మ.. కళ్లుమూసి తెరిచేలోపే స్టంపింగ్
విజయ్ మాస్టర్ ప్లాన్.. ఒక్కొక్కరిని లాగుతూ ప్రత్యర్థులకు షాక్..
విజయ్ మాస్టర్ ప్లాన్.. ఒక్కొక్కరిని లాగుతూ ప్రత్యర్థులకు షాక్..
'ఆ ఒకే ఒక్క తప్పుతో టీమిండియా కొంప ముంచిన గంభీర్‌'
'ఆ ఒకే ఒక్క తప్పుతో టీమిండియా కొంప ముంచిన గంభీర్‌'
సూది నుండి పుట్టిన బుల్లెట్ ప్రేమ.. నేడు మార్కెట్లో రారాజు
సూది నుండి పుట్టిన బుల్లెట్ ప్రేమ.. నేడు మార్కెట్లో రారాజు
పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన.. ఉల్లి, వెల్లుల్లి..
పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన.. ఉల్లి, వెల్లుల్లి..
విన్నర్ ఎవరో గూగుల్ కూడా ఫిక్స్ అయ్యిపోయింది..
విన్నర్ ఎవరో గూగుల్ కూడా ఫిక్స్ అయ్యిపోయింది..