Watch Video: మీ పిల్లల్ని ఆటోల్లో స్కూల్‌కు పంపుతున్నారా?.. జాగ్రత్త..! ఇది చూస్తే.. అస్సలు వెళ్లనివ్వరు!
పేరెంట్స్ మీరే.. మీ పిల్లలను ఆటోలు, వ్యాన్‌లలో స్కూల్‌కు పంపుతున్నారా? అయితే ఇకపై జాగ్రత్తగా ఉండడండి.. వాళ్లను తీసుకెళ్లే వాహనదారులు సరిగ్గా డ్రైవింగ్ చేస్తున్నారో లేదో గమనించండి.. లేదా పెను ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే తాజాగా ఓ ఆటో డ్రైవర్ స్కూల్ పిల్లలను ఎక్కించుకొని రోడ్డుపై ఆటోతో స్టంట్స్ చేస్తూ ప్రయాణించాడు. అది గమనించిన స్థానికులు అతన్ని ప్రశ్నించడంతో నిర్లక్ష సమాధానాలు చెప్పి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే గా మీ డౌట్ తెలుసుకుందాం పదండి.

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో చాలా మంది తల్లిదండ్రులను తమ పిల్లను స్కూల్ దగ్గర కూడా దించలేకపోతున్నారు. దీంతో వాళ్లను ఆటో, లేదా వ్యాన్‌లో స్కూళ్లకు పంపుతున్నారు. కానీ ఆడ్రైవర్ పిల్లల్ని సరిగ్గా స్కూల్‌కు చేరుస్తున్నాడా? లేదా అనే విషయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు. తాజాగా హైదరాబాద్ నగరం పాతబస్తీ పరిధి బహదూర్‌పుర నుంచి జూ పార్క్ రోడ్డు మార్గంలో స్కూల్ పిల్లలను ఎక్కించుకొని వెళ్తున్న ఓ ఆటో డ్రైర్.. రోడ్డుపై స్టంట్స్ చేస్తూ.. వాహనాన్ని ప్రమాదకరంగా డ్రైవ్ చేశాడు. అదిగమనించిన కొందరు వాహనదారులు.. ఆటోలో స్కూల్ పిల్లల్ని పెట్టుకొని ఆ.. డ్రైవింగ్ ఏంటని ప్రశ్నించగా.. నిర్లక్ష్యపు సమాధానం చెప్పి అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
పిల్లల్ని ఎక్కించుకొని ఆటో డ్రైవర్ చేస్తున్న స్టంట్స్‌కు సంబంధించిన వీడియోలను చిత్రీకరించిన కొందరు స్థానికులు వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. వీటిపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. తల్లిదండ్రులు ఎంతో నమ్మకంగా పంపిస్తే ఇలా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం ఏంటని.. ఆటో డ్రైవర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా కాస్త తమ పనులను పక్కన పెట్టి.. పిల్లలను స్కూల్ వరకు దింపేందుకు ప్రయత్నించాలని పలువురు సూచిస్తున్నారు.
చాలా మంది తల్లిదండ్రులు ఆటో డ్రైవర్లను నమ్మి పిల్లల్ని స్కూళ్లకు ఆటోలో పంపిస్తున్నారు.. కానీ, కొంతమంది ఆటో డ్రైవర్లు ఇలా తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేస్తున్నారు. చిన్నపిల్లల పట్ల కనీస బాధ్యత వహించకుండా ఇష్టారీతిన డ్రైవ్ చేస్తూ చిన్నారుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. అందుకే పాఠశాలలకు పంపించే పిల్లల బాధ్యత ఖచ్చితంగా తల్లిదండ్రులే తీసుకోవాలని, లేకపోతే ఊహించని అనర్థాలు ఎదురువవుతాయని ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసినవారు అంటున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




