TS EAPCET 2026 Exam Date: ఈఏపీసెట్ 2026 రాత పరీక్ష తేదీ వచ్చేసింది.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్!
వచ్చే ఏడాదికి EAPCET 2026 మే మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. TGCHE ప్రభుత్వ ఆమోదం కోసం ప్రాథమిక షెడ్యూల్‌ను సిద్ధం చేస్తుంది. ఇతర రాష్ట్ర స్థాయి CETలు కూడా మేలో నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్లు ఫిబ్రవరి 2026లో వచ్చే అవకాశం ఉంది..

హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( TG EAPCET ) 2026 మే మొదటి వారంలో నిర్వహించబడే అవకాశం ఉంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ప్రోగ్రామ్‌లలోప్రవేశాలకు ప్రవేశ పరీక్షలను మే 4 లేదా 5 నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ దిశగా కౌన్సిల్ ప్రాథమిక షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం విద్యామండలి పంపించింది. ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత, ఈఏపీసెట్ 2026 షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. అంతేకాకుండా వచ్చే మే నెలలో EdCET, LAWCET, ICET, PGECET, ECET, PECET లను నిర్వహించే అవకాశాలపై కూడా TGCHE కసరత్తు చేస్తుంది. ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనుంది.
ఇక JNTU-హైదరాబాద్ ఆధ్వర్యంలోనే వచ్చే ఏడాదికి కూడా TG EAPCET 2026 పరీక్ష నిర్వహణ బాధ్యతలను చేపట్టే అవకాశం ఉంది. మిగిలిన CETలను వేర్వేరు యూనివర్సిటీలకు కేటాయిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.








