సీపీఐ సీనియర్ నేత నారాయణ కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఇండిగో సంక్షోభాన్ని ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చూస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇండిగో సంస్థను అదానీకి అప్పగించి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని తొలగించే కుట్ర జరుగుతోందని నారాయణ వ్యాఖ్యానించారు. ఇది ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టే వ్యూహమని విమర్శించారు.