Andhra News: వార్నీ.. ప్రకృతి వింత అంటే ఇదేనేమో.. ఒక మొక్క జొన్నకు ఇన్ని పొత్తులా..!
సాధారణంగా మొక్కజొన్నకు ఒకచోట ఒక పొత్తు రావడం సహజం. కొన్ని సందర్భాల్లో రెండు మూడు పొత్తులు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఒకే మొక్క జొన్న చెట్టుకు ఏకంగా పదుల సంఖ్యలో పొత్తులు రాశాయి. ఈ ప్రకృతి విచిత్రం సామాన్యులకే కాదు.. మొక్కజొన్న రైతులకు సైతం ఆశ్చర్యం కలిగించింది. దీంతో ఆ మొక్కజొన్నలపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతుంది.

సాధారణంగా మొక్కజొన్నకు ఒకచోట ఒక పొత్తు రావడం సహజం. కొన్ని సందర్భాల్లో రెండు మూడు పొత్తులు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఒకే మొక్క జొన్న చెట్టుకు ఏకంగా పదుల సంఖ్యలో పొత్తులు రాశాయి. ఈ ప్రకృతి విచిత్రం సామాన్యులకే కాదు.. మొక్కజొన్న రైతులకు సైతం ఆశ్చర్యం కలిగించింది. దీంతో ఆ మొక్కజొన్నలపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతుంది. విరాల్లోకి వెళ్తే.. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మఠం భీమవరం పంచాయతీ పి ఎల్ కొత్తూరులో ఈ దృశ్యం సామాన్యులకే కాదు రైతులను ఆశ్చర్యపరిచింది.
నాగేశ్వరరావు అనే రైతు.. తన పొలంలో హైబ్రిడ్ విత్తనాలు తెచ్చి వేశాడు. వాటిలో ఓ చెట్టుకు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 పొత్తులు కాసాయి. అది చూసిన రైతు ఆశ్చర్యపోయాడు. తాను వేసిన విత్తు నుంచి వచ్చిన మొక్కకు ఇలా జొన్నపొత్తులు కాయడంతో చూసి సంబరపడ్డాడు. ఈ విషయం కాస్త ఆ నోట ఈ నోట పాకడంతో.. ఈ మొక్కజొన్న పొత్తును చూసేందుకు రైతులే కాదు సామాన్యులు కూడా తరలివస్తున్నారు.
అయితే కొన్ని రకాల హైబ్రిడ్ విత్తనాలతో పాటు భూసారాన్ని బట్టి ఇలా మొక్కలకు వచ్చే పొత్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. ఇదిలా ఉండగా ఈ విచిత్ర మొక్క జోన్నకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి తెగ వైరల్ చేస్తున్నారు స్థానికులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




