కృష్ణా జిల్లా కొండపల్లి శాంతినగర్ వద్ద గ్యాస్ సిలిండర్ల లారీ నుంచి గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ లారీని నడిరోడ్డుపై వదిలివెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని లారీని ఐఓసికి తరలించారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చి, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.