ఛత్తీస్గఢ్ మహిళా డీఎస్పీ కల్పనా వర్మపై హోటల్ యజమాని దీపక్ టాండన్ సంచలన ఆరోపణలు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి రెండు కోట్ల నగదు, టయోటా కారు, విలువైన బహుమతులు కాజేసిందని ఆయన వెల్లడించారు. న్యాయం కోరుతూ మీడియాను ఆశ్రయించడంతో ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.