Actor : రెండుసార్లు విడాకులు.. ముగ్గురు పిల్లల తండ్రి.. 60 ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డ హీరో..
ప్రేమకు వయస్సు, భాష, కులం లేదా మతం వంటి సరిహద్దులు లేవు. ప్రజలు ఏ వయసులోనైనా ప్రేమలో పడతారు. అదేవిధంగా ఇప్పుడు సినీరంగంలో ప్రేమ, బ్రేకప్, పెళ్లి, విడాకులు సైతం కామన్ అయ్యాయి. అయితే ఇండస్ట్రీలో తోపు హీరో. కానీ తన 60 సంవత్సరాల వయసులో మూడవసారి ప్రేమలో పడిన నటుడు ఎవరో తెలుసుకుందామా.

సినీరంగంలో లవ్, బ్రేకప్ కామన్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోహీరోయిన్స్ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. అలాగే ప్రేమకు వయస్సు, భాష, కులం లేదా మతం వంటి సరిహద్దులు లేవు. ఏ వయసులోనైనా ప్రేమ పుట్టొచ్చు. ఇప్పుడు ఓ హీరో గురించి తెలుసుకుందామా. 60 ఏళ్ల వయసులో మూడవ సారి ప్రేమలో పడ్డారు. అతడు హిందీ సినిమా ప్రపంచంలో స్టార్ హీరో. ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాలలో నటించి మెప్పించారు. విభిన్న కంటెంట్ చిత్రాలతో టాప్ హీరోగా నిలిచిన ఆయన.. వ్యక్తిగత జీవితంలో మాత్రం అంతగా సక్సెస్ కాలేకపోయారు. ఈ నటుడు మొదటిసారి వివాహం చేసుకున్నాడు మరియు ఇద్దరు పిల్లలను కలిగి ఉన్నాడు. నలుగురు సభ్యుల కుటుంబంలో అతను సంతోషంగా ఉన్నాడు. కానీ మొదటిభార్యతో విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత రెండో వివాహం చేసుకున్నాడు. అతని రెండవ భార్య ఒక ప్రముఖ బాలీవుడ్ నిర్మాత. రెండవ వివాహం తర్వాత, ఆ నటుడికి ఒక కుమారుడు ఉన్నాడు. రెండవ భార్య కొడుకు పుట్టిన వెంటనే, అతని పెద్ద కుమార్తె వివాహం చేసుకుంది. పెద్ద కుమార్తె వివాహానికి కొన్ని సంవత్సరాల ముందు నటుడు తన రెండవ భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు 60 ఏళ్ల వయసులో మూడోసారి ప్రేమలో పడ్డారు. అతడి పేరు సూపర్ స్టార్ అమీర్ ఖాన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను గౌరీ స్ప్రాట్‌తో రెండేళ్లకు పైగా ప్రేమలో ఉన్నాను. . నా జీవితంలో భాగమైనందుకు కిరణ్ రావు, రీనా దత్తాకు నేను కృతజ్ఞుడను” అని అన్నారు.
ఆమిర్ ఖాన్ 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు జునైద్ ఖాన్, ఇరా ఖాన్. కానీ ఆమిర్ ఖాన్ 2002లో రీనా దత్తాను విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత 2005లో దర్శకుడు, నిర్మాత కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. వారికి ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు. 16 సంవత్సరాల వివాహం తర్వాత 2011లో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు గౌరీ ఖాన్ అనే మహిళతో ప్రేమలో ఉన్నారు.

Aamir Khan News
ఇవి కూడా చదవండి : Bigg Boss : నా బట్టలు నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేనుంటా.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..








