నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట 75 ఏళ్ల రామయ్య, తనకు రావాల్సిన జీతం కోసం నిరసన తెలిపాడు. 2018లో డంపింగ్ యార్డులో పనిచేసినందుకు ₹72,000 వేతనం రావాల్సి ఉంది. ఆరేళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.