AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: నడి రోడ్డుపై ఫ్యాన్స్‌తో గొడవ.. సహనం కోల్పోయిన బాబర్.. వీడియో వైరల్..

Babar Azam Scolds Fans in England: పాకిస్థాన్ క్రికెట్ జట్టు (Pakistan Cricket Team) ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆ జట్టు నిన్న ఇంగ్లండ్‌తో మూడో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. కానీ, వర్షంతో రద్దైంది. సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ గెలిచింది.

Video: నడి రోడ్డుపై ఫ్యాన్స్‌తో గొడవ.. సహనం కోల్పోయిన బాబర్.. వీడియో వైరల్..
Babar Azam Viral Video
Venkata Chari
|

Updated on: May 29, 2024 | 10:17 AM

Share

Babar Azam Scolds Fans in England: పాకిస్థాన్ క్రికెట్ జట్టు (Pakistan Cricket Team) ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆ జట్టు నిన్న ఇంగ్లండ్‌తో మూడో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. కానీ, వర్షంతో రద్దైంది. సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ గెలిచింది. ఇక మూడో మ్యాచ్ కూడా వర్షంతో రద్దైంది. అయితే, మూడో మ్యాచ్‌కు ముందు, పాక్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ వీడియో ఒకటి బయటికొచ్చింది. వీడియోలో, బాబర్ ఆజం అభిమానులతో వాగ్వాదానికి దిగినట్లు చూడొచ్చు.

అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాబర్ ఆజం..

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో కనిపించింది. వీడియోలో, బాబర్ ఆజం వీధుల్లో కనిపించాడు. ఇక్కడ అతను ఎవరితోనో మాట్లాడుతున్నాడు. కానీ, ఆ సమయంలో అభిమానులు అతనిని చుట్టుముట్టారు. దీంతో బాబార్‌కు కోపం వస్తుంది. అప్పుడు బాబర్ కోపంగా అభిమానులతో, ‘నాకు 2 నిమిషాలు ఇస్తారా, దయచేసి నాకు రెండు నిమిషాలు ఇవ్వండి’ అంటూ చెప్పుకొచ్చాడు. బాబర్ ఆజం ఇలా చెప్పగానే అభిమానులు అతడికి కొంత దూరం వెళ్లారు. కానీ, బాబర్ కోపం మాత్రం చల్లారలేదు. ఇంకా ‘నాపైకి రావొద్దు, నేను మాట్లాడుతున్నాను, వీడియోలు తీయోద్దు’ అంటూ కోప్పడ్డాడు. అభిమానులపై బాబర్ అజామ్ అసంతృప్తి, కోప్పడుతున్న ఈ వీడియో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ తర్వాత కొంత శాంతించిన బాబర్ ఆజం ఫ్యాన్స్‌తో సెల్ఫీలు దిగాడు. ఆ వెంటనె అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

బాబర్ ఆజం వీడియో..

బాబర్ ఆజం ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత తెలివైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా పరిగణిస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా అతని బ్యాటింగ్‌కు అభిమానులున్నారు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు కేవలం బాబర్ అజామ్ కెప్టెన్సీలో ఆడనుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇటీవల బాబర్ అజమ్‌ను జట్టు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు కెప్టెన్‌గా చేసింది.

బాబర్ ఆజం కంటే ముందు జట్టు కమాండ్ షాహీన్ అఫ్రిది చేతిలో ఉండేది. అయితే, న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌లో మాత్రమే షాహీన్ కెప్టెన్‌గా కొనసాగాడు. ఈ పర్యటనలో పాకిస్తాన్ ఓటమి తర్వాత, అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించారు. పీసీబీ మళ్లీ బాబర్‌కు ఆదేశాన్ని అప్పగించింది. ఇలాంటి పరిస్థితుల్లో బాబర్ కెప్టెన్సీలో వచ్చే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి