పాకిస్థాన్
ఆగస్టు 14, 1947న పాకిస్థాన్ భారతదేశం నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా అవతరించింది. మహ్మద్ అలీ జిన్నాను పాకిస్థాన్ జాతిపితగా పరిగణిస్తారు. పాకిస్థాన్ దేశానికి జిన్నా మొదటి గవర్నర్ జనరల్ కాగా.. లియాఖత్ అలీ ఖాన్ మొదటి ప్రధాన మంత్రిగా పనిచేశారు.
పాకిస్థాన్ దేశ రాజధాని ఇస్లామాబాద్. లాహోర్, కరాచీ కూడా పాకిస్థాన్ దేశంలోని ప్రధాన నగరాలు. ఈ నగరాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. పాకిస్థాన్ భౌగోళికంగా ప్రపంచంలో 33వ అతిపెద్ద దేశం. దక్షిణాసియాలో రెండవ అతిపెద్ద దేశం. పాకిస్థాన్ 881,913 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
2023 నాటికి, పాకిస్థాన్ జనాభా 24.15 కోట్ల మంది. ఇది ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశంగా పరిగణించబడుతుంది. 2017 జనాభా ప్రకారం, పాకిస్థాన్ జనాభా 20.7 కోట్లు. అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ప్రపంచంలో పాకిస్థాన్ ఆరవ స్థానంలో ఉన్నది.
మత ప్రాతిపదిక పాకిస్థాన్‌ను భారతదేశం నుండి విభజించారు. కానీ బెంగాలీ భాష, గుర్తింపు కోసం ఉద్యమం తర్వాత, 1971లో పశ్చిమ పాకిస్థాన్ (ప్రస్తుత పాకిస్థాన్ దేశం) నుండి విడిపోయి తూర్పు పాకిస్థాన్ ( నేటి బంగ్లాదేశ్) ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ప్రాథమికంగా వ్యవసాయంపై ఆధారపడింది. ఇక్కడ ప్రధాన మతం ఇస్లాం. ఇక్కడ ముస్లింల సంఖ్య 96 శాతం కాగా.. హిందువులు 1.6 శాతం ఉన్నారు. ఉర్దూ, ఇంగ్లీష్ ఆ దేశంలో అధికారిక భాషలుగా ఉన్నాయి.
పాకిస్థాన్ ఉగ్రవాదం, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత వంటి కీలక సమస్యలతో సమమతమవుతోంది. పలు అంశాల్లో పాకిస్థాన్‌కు చైనా మద్ధతు లభిస్తోంది. అరీఫ్ అల్వీ ప్రస్తుతం పాకిస్థాన్ దేశాధ్యక్షుడిగా ఉన్నారు.