Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Operation Sindoor Update Highlights: ఉగ్రవాదుల క్రూరత్వానికి తగిన గుణపాఠం చెప్పాం: మోదీ

Subhash Goud

|

Updated on: May 12, 2025 | 9:10 PM

Narendra Modi on India Pakistan Ceasefire Updates in Telugu: నాలుగు రోజుల ఉద్రిక్తత తర్వాత శనివారం భారతదేశం- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించారు. దీని తరువాత సరిహద్దులో ఉద్రిక్తత తగ్గింది. ఉగ్రవాదులపై భారతదేశం చర్య తీసుకున్న తర్వాత తలెత్తిన పరిస్థితి రెండు దేశాల మధ్య వివాదం ప్రారంభమయ్యేలా ఉంది.

PM Modi Operation Sindoor Update Highlights: ఉగ్రవాదుల క్రూరత్వానికి తగిన గుణపాఠం చెప్పాం: మోదీ

భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ ప్రసంగించడం ఇదే తొలిసారి. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్‌పై ఉద్రిక్తత ప్రారంభమైనప్పటి నుండి ప్రధాని మోదీ నిరంతరం చురుగ్గా ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయన నిరంతర సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్‌ సింధూర్‌ గురించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. నిరంతరం ఆర్మీ చీఫ్‌లు, CDS, NSA నుండి ఆపరేషన్‌కు సంబంధించి కీలక అప్‌డేట్‌ చేసుకుంటూనే ఉన్నారు.

నాలుగు రోజుల ఉద్రిక్తత తర్వాత శనివారం భారతదేశం- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించారు. దీని తరువాత సరిహద్దులో ఉద్రిక్తత తగ్గింది. ఉగ్రవాదులపై భారతదేశం చర్య తీసుకున్న తర్వాత తలెత్తిన పరిస్థితి రెండు దేశాల మధ్య వివాదం ప్రారంభమయ్యేలా ఉంది. కానీ ఈ వివాదం ఆగిపోయింది. అయితే ఈ కాల్పుల విరమణ కొనసాగుతుందా లేదా అనేది పాకిస్తాన్ సైన్యం కార్యకలాపాలు, DGMO మధ్య చర్చలపై ఆధారపడి ఉంటుంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 12 May 2025 08:24 PM (IST)

    ఉగ్రవాదుల క్రూరత్వానికి తగిన గుణపాఠం చెప్పాం

    ఉగ్రవాదుల క్రూరత్వం భరించలేని స్థితికి చేరింది. కుటుంబం, కన్నబిడ్డల ముందే దయలేకుండా ప్రాణాలు తీశారు. మన తల్లుల సింధూరం చెరిపితే ఏం జరుగుతుందో చూపించామన్నారు. ఉగ్ర కురత్వానికి తగిన గుణపాణం చెప్పామన్నారు మోదీ.

  • 12 May 2025 08:21 PM (IST)

    ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశాం

    బైసరన్‌లో కుటుంబసభ్యుల మధ్యే 26 మందిని ఉగ్రమూక బలి తీసుకుందన్నారు మోదీ. మన తల్లుల బొట్టు చెరిపితే ఏం జరుగుతుందో చూపించామన్నారు. పాక్‌పై బాంబుల వర్షం కురిపించి భారత్‌ సత్తా ఏంటో చూపించామన్నారు. పాక్‌లోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశామన్నారు. బహావల్‌పూర్‌ గ్లోబల్‌ టెర్రరిజానికి యూనివర్సిటీ లాంటిదన్నారు. అందుకే టెర్రరిస్ట్‌లని చెండాడాం. ఆ వర్శిటీని నేలమట్టం చేశామన్నారు.

  • 12 May 2025 08:18 PM (IST)

    పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లపై బాంబుల వర్షం కురిపించాం

    భారత డ్రోన్లు, మిస్సైళ్లు వాటికి నిర్దేశించిన టార్గెట్లను ఛేదించాయని మోదీ అన్నారు. పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లపై బాంబుల వర్షం కురిపించాయి. పాకిస్తాన్ వేటిని చూసుకుని గర్వంతో విర్రవీగుతుందో వాటిపై విరుచుకుపడ్డాయి. ఈ దాడులతో బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్.. భారత్ DGMOను సంప్రదించింది. పాకిస్తాన్ ప్రయోగించిన మిస్సైళ్లు, డ్రోన్లను భారత్ గగనతలంలోనే ముక్కలు, ముక్కలు చేసేశాయన్నారు. భవిష్యత్తులో పాకిస్తాన్ మరోసారి ఇలాంటి దుస్సాహసం చేయకుండా గుణపాఠం నేర్పామన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ తాత్కాలికంగా అమల్లోకి తీసుకొచ్చామన్నారు.

  • 12 May 2025 08:16 PM (IST)

    ఉగ్రవాదులు ఆ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు

    దశాబ్దాలుగా ఆయుధాలు చేతబట్టి ఉగ్రవాదులు ఆ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారని, భారత్ తీసుకున్న ఈ చర్యతో పాకిస్తాన్ తీవ్రమైన నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయిందన్నారు. ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి భారత్ పై దాడి ప్రారంభించింది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి భారత్‌లోని ఆలయాలు, గురుద్వారాలు, సామాన్యుల నివాసాలపై దాడులు చేసిందన్నారు.

  • 12 May 2025 08:14 PM (IST)

    ఒక్క దెబ్బతో ఉగ్ర నాయులకు చావుదెబ్బ

    ఒక్క దెబ్బతో ఉగ్రనాయకులను చావుదెబ్బ తీశామని మోదీ అన్నారు. కుటుంబం, కన్నబిడ్డల ముందు దయలేకుండా ప్రాణాలు తీశారని అన్నారు. మన తల్లుల సింధూరం చెరిపితే ఏం జరుగుతుందో చూపించామన్నారు.

  • 12 May 2025 08:12 PM (IST)

    అందుకే ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో ఉగ్రవాదంపై పోరు

    ఉగ్రవాదంపై కఠిన చర్యలు దేశంలోని ప్రతి ఒక్కరు నినదించాయని, మన దేశ మహిళల సింధూరాన్ని తుడిచేస్తే ఫలితం ఎలా ఉంటుందో చూపించాలని నిర్ణయించామని, అందుకే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదంపై పోరు మొదలుపెట్టామన్నారు.

  • 12 May 2025 08:10 PM (IST)

    దేశంలోని మహిళలకు అంకితం చేస్తున్నాం

    సైనిక బలగాల సాహసం, పరాక్రమాన్ని దేశంలోని మహిళలకు అంకితం చేస్తున్నామని మోదీ అన్నారు. అమాయక పర్యాటకులను వారి కుటుంబ సభ్యులు, పిల్లల ముందు కాల్చి చంపారు. ఈ ఉగ్రదాడి తర్వాత దేశంలోని అన్ని వర్గాలు, అన్ని పార్టీలు ఒకే స్వరంతో స్పందించాయని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని నినదించాయి. మన దేశ మహిళల సింధూరాన్ని తుడిచేస్తే ఫలితం ఎలా ఉంటుందో చూపించాలని నిర్ణయించామని అన్నారు.

  • 12 May 2025 08:06 PM (IST)

    మన బలగాలకు నా సెల్యూట్‌ : ప్రధాని మోదీ

    ఆపరేషన్‌ సింధూర్‌లో భాగంగా మన బలగాలకు నా సెల్యూట్‌ అని ప్రధాని మోదీ అన్నారు. ఆపరేషన్‌ సింధూర్‌ అనంతరం మోదీ మాట్లాడారు. ఆపరేషన్‌ సింధూర్‌లో సాహసోపేతమన ప్రదర్శన చేశారన్నారు. పాక్‌కు పీవోకేను వదలడం తప్ప గత్యంతరం లేదన్నారు.

  • 12 May 2025 08:02 PM (IST)

    మోదీ ప్రసంగం

    పాక్‌-భారత్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత తొలిసారిగా ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడుతున్నారు.

  • 12 May 2025 07:11 PM (IST)

    కాల్పుల విరమణ తర్వాత

    కాల్పుల విరమణ తర్వాత ఈరోజు త్రివిధ సైన్యాల డీజీఎంఓలు ఆపరేషన్ సిందూర్ పై విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ ఆపరేషన్‌ సింధూర్‌పై మోదీ మాట్లాడనున్నారు.

  • 12 May 2025 06:31 PM (IST)

    ప్రధాని తొలి ప్రసంగం

    ఆపరేషన్ సింధూర్ ప్రారంభమయ్యాక తొలిసారి ప్రసంగం చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దీంతో అందరి చూపు మోదీ ప్రసంగం పైనే ఉంది. ఏం మాట్లాడనున్నారనేదానిపై ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు దేశ ప్రజలు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతికారం తర్వాత మాట్లాడనున్నారు మోదీ.

Published On - May 12,2025 6:27 PM

Follow us