Rohit Sharma: ‘ఇక వీడ్కోలు’.. రోహిత్ శర్మ పోస్ట్‌తో ఫ్యాన్స్‌లో గందరగోళం..
Rohit Sharma: ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కోల్పోయినప్పటికీ, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన చివరి వన్డేలో రోహిత్ శర్మ (121 నాటౌట్) అద్భుతమైన సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీతో కలిసి 168 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

Rohit Sharma: భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటన ముగింపులో చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ అభిమానుల్లో కీలక చర్చకు దారితీసింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ముగిసిన తర్వాత, ‘హిట్‌మ్యాన్’ తన అధికారిక ఖాతాలో ఒక ఫోటోను షేర్ చేస్తూ, “వన్ లాస్ట్ టైమ్.. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సిడ్నీ (One last time, signing off from Sydney)” అనే క్యాప్షన్ ఇచ్చాడు.
దీంతో ఆస్ట్రేలియా గడ్డపై ఇది చివరి పర్యటనా? లేక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నారా? అనే ప్రశ్నలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో, అభిమానుల మధ్య తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి.
సిడ్నీలో వీడ్కోలు శతకం..
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కోల్పోయినప్పటికీ, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన చివరి వన్డేలో రోహిత్ శర్మ (121 నాటౌట్) అద్భుతమైన సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీతో కలిసి 168 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ సెంచరీతో సిరీస్‌లో అత్యధిక పరుగులు (202 పరుగులు, సగటు 101) చేసిన ఆటగాడిగా నిలిచి, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా గెలుచుకున్నారు.
సిడ్నీలో ఆయన ఆడిన చివరి వన్డే ఇన్నింగ్స్ కావచ్చని, అందుకే భావోద్వేగంతో ఈ పోస్ట్ పెట్టారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
రోహిత్ మాటల్లో..
One last time, signing off from Sydney 👊 pic.twitter.com/Tp4ILDfqJm
— Rohit Sharma (@ImRo45) October 26, 2025
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడిన మాటలు కూడా ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి. “ఆస్ట్రేలియాకు రావడం, ఇక్కడ ఆడటం నాకు ఎప్పుడూ ఇష్టమే. 2008 నాటి అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడ నా ఇన్నింగ్స్, విజయాన్ని అందుకునేందుకు ఇదొక చక్కని ముగింపు. మేమిద్దరం (తాను, విరాట్ కోహ్లీ) మళ్లీ ఆస్ట్రేలియాకు వస్తామో లేదో తెలియదు. కానీ, ఇన్నేళ్లుగా ఇక్కడ ఆడిన క్రికెట్‌ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను” అని ఆయన అన్నాడు.
2027 వరల్డ్ కప్ లక్ష్యం..
రోహిత్ శర్మ కోచ్ దినేష్ లాడ్ మాట్లాడుతూ, రోహిత్ శర్మ ప్రస్తుతం రిటైర్మెంట్ గురించి ఆలోచించడం లేదని, 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆడాలనే లక్ష్యంతోనే ఉన్నారని స్పష్టం చేశారు. అయితే, ఆస్ట్రేలియాలో మరో అంతర్జాతీయ పర్యటనకు వచ్చే అవకాశం లేకపోవడంతో, సిడ్నీని ఉద్దేశిస్తూ ఆయన ఈ భావోద్వేగ సందేశం ఇచ్చి ఉంటారని తెలుస్తోంది.
ఏదేమైనా, ‘వన్ లాస్ట్ టైమ్’ అంటూ రోహిత్ చేసిన ఈ పోస్ట్, సిడ్నీలో ఆయన వీడ్కోలు శతకంతో కూడిన అద్భుతమైన ఇన్నింగ్స్‌ను క్రికెట్ అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








