CSK vs GT, IPL 2024: శివాలెత్తిన శివమ్ దూబే.. రాణించిన రచిన్, రుతురాజ్‌… గుజరాత్ టార్గెట్ ఎంతంటే?

గుజరాత్ టైటాన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. సొంతగడ్డపై చెన్నై బ్యాటర్లు శివాలెత్తారు. మొదట ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర చెరో 46 పరుగులు చేసి జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఆతర్వాత రహానే (12) త్వరగా ఔటైనా ఆల్ రౌండర్ శివమ్ దూబే శివాలెత్తాడు.

CSK vs GT, IPL 2024: శివాలెత్తిన శివమ్ దూబే.. రాణించిన రచిన్, రుతురాజ్‌... గుజరాత్ టార్గెట్ ఎంతంటే?
Chennai Super Kings Vs Gujarat Titans
Follow us

|

Updated on: Mar 26, 2024 | 10:07 PM

గుజరాత్ టైటాన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. సొంతగడ్డపై చెన్నై బ్యాటర్లు శివాలెత్తారు. మొదట ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర చెరో 46 పరుగులు చేసి జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఆతర్వాత రహానే (12) త్వరగా ఔటైనా ఆల్ రౌండర్ శివమ్ దూబే శివాలెత్తాడు. ధనాధన్ బ్యాటింగ్ తో మెరుపు అర్థసెంచరీ సాధించాడు. 2 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో కేవలం 23 బంతుల్లోనే 51 పరుగులు చేసి ఔటయ్యాడు దూబే. డారిల్ మిచెల్ (20) కూడా వేగంగా పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా సాయి కిశోర్, జాన్సన్, మోహిత్ శర్మ తలా ఒక వికెట్ తీశారు.

ఇవి కూడా చదవండి

కాగా ఈ మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర తుఫాను ఇన్నింగ్స్‌ ఆడాడు. గుజరాత్ బౌలర్లను, ఫీల్డర్లను పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా పవర్ ప్లేలోనే బౌలర్లపై విరుచుకుపడ్డాడు.రుతురాజ్ గైక్వాడ్-రచిన్ రవీంద్ర 27 బంతుల్లో అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రచిన్ రవీంద్ర కేవలం 4 పరుగుల తేడాతో హాఫ్ సెంచరీని కోల్పోయాడు. 20 బంతుల్లో 46 పరుగులు చేసి రచిన్ రవీంద్ర ఔటయ్యాడు. రషీద్ స్పిన్‌కు చిక్కి స్టంప్ ఔట్ అయ్యాడు. చెన్నై 104 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 12 బంతుల్లో 12 పరుగుల వద్ద అజింక్య రహానే ఔటయ్యాడు. రితురాజ్ గైక్వాడ్ రూపంలో మూడో షాక్ తగిలింది. 36 బంతుల్లో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే శివమ్ దూబే 23 బంతుల్లో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. శివమ్ దూబే తన ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. తర్వాత వచ్చిన సమీర్ రిజ్వీ 6 బంతుల్లో 14 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇందులో 2 సిక్సర్లు ఉన్నాయి.

గుజరాత్ టైటాన్స్ జట్టు..

శుభమాన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జోయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్,  జాన్సన్.

ముంబై ఇండియన్స్ జట్టు

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, షామ్స్ ములానీ, పీయూష్ చావ్లా, జెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, ల్యూక్ వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.