తెలుగులో ఆ హీరో అంటే చాలా ఇష్టం.. మనసులో మాట బయట పెట్టిన ఛాంపియన్ బ్యూటీ
శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఛాంపియన్. ఈ సినిమా గురించి హీరోయిన్ మాట్లాడుతూ.. తెలుగులో లాంచ్ కావడం ఆనందంగా వుంది. ఇందులో చేసిన చంద్రకళ క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని లేటెస్ట్ యంగ్ హీరోయిన్ అనస్వర రాజన్ చెప్పుకొచ్చింది

స్వప్న సినిమాస్ అప్ కమింగ్ మూవీ ‘ఛాంపియన్’ ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనస్వర రాజన్ విలేకరలు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
సినిమాలు తక్కువే కానీ క్రేజ్ మాత్రం ఫుల్.. మరీ అంత క్యూట్ గా ఉంది ఏంది మావ..!!
వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ లాంటి గొప్ప సంస్థ చేస్తున్న సినిమాతో తెలుగుకి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు తెలుగు స్పష్టంగా రాదు. అయినప్పటికీ నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. నా పట్ల ఎంతో కేర్ తీసుకున్నారు. వారి నిర్మాణంలో నా తొలి తెలుగు సినిమా రావడం ఎంతో ఆనందంగా వుంది అని తెలిపింది. అలాగే తెలుగు డైలాగ్స్ చెప్పడం గురించి మాట్లాడుతూ.. నిజానికి తెలుగు భాష మీద నాకు పెద్ద అవగాహన లేదు. అయితే చాంపియన్ డైరెక్టర్ ప్రదీప్ గారు అలాగే యూనిట్లో అందరూ కూడా నాకు భాష విషయంలో ఎంతగానో సపోర్ట్ చేశారు. వాళ్ల సపోర్ట్ తోనే నేను తెలుగులో డైలాగ్స్ అంత చక్కగా పలకగలిగాను. డైరెక్టర్ గారు ప్రతి పదాన్ని చక్కగా నేర్పేవారు. నేను భాషను పలికిన విధానం ఆడియన్స్ కి కూడా నచ్చుతుందని భావిస్తున్నాను.
ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఎఫైర్స్‌కు కొదవే లేదు.. కట్ చేస్తే 50ఏళ్ల వయసులోనూ సింగిల్
తెలుగు ప్రేక్షకులు చాలా గొప్ప మనసున్న ఆడియన్స్. నేను వేరే భాషలో చేసిన సినిమాలు చూసి ఎన్నో అద్భుతమైన సందేశాల్ని పంపారు. తెలుగు ఆడియన్స్ ప్రోత్సాహం నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు తెలుగులో చేస్తున్న నా తొలి సినిమా కూడా అంతే గొప్పగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. తెలుగు సినిమాలో ప్రతిదీ చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఇక్కడ ఫిలిం మేకర్స్, ప్రొడ్యూసర్స్ చాలా సపోర్ట్ గా ఉంటారు. ఒక్కసారి ఇక్కడ పనిచేస్తే మళ్లీమళ్లీ తెలుగు సినిమాలే చేయాలనిపిస్తుంది. ఇక్కడ చాలా పెద్ద కాన్వాస్ లో సినిమాలు తీయడం నాకు చాలా నచ్చింది.
సూపరో సూపర్..! ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అయేషా ఇలా మారిపోయిందేంటీ..!!
ఈ కథ విన్నప్పుడు నాకు చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఇలాంటి కథ ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఒక మంచి సినిమాకి ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఇందులో చంద్రకళ పాత్ర ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది. ఈ కథ విన్నప్పుడు నేను చేసిన చంద్రకళ పాత్ర నాకు ఎంతగానో నచ్చింది. ఆ పాత్ర చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఒక ఆడియన్ గా ఇలాంటి సినిమాలు చూడటనికి నేను చాలా ఇష్టపడతాను. అలాగే రోషన్ వెరీ స్వీట్. తను డైలాగ్స్, డ్యాన్స్ లో నాకు చాలా సపోర్ట్ చేశారు. తను స్వీటెస్ట్ కోస్టార్ అని చెప్పుకొచ్చింది. అలాగే ఆమె మాట్లాడుతూ.. నిజానికి నాకు వింటేజ్ పీరియడ్ సినిమాలు చేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనం రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేయలేని ఎలిమెంట్స్ ఇందులో మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆ కాలం కాస్ట్యూమ్స్ వేసుకోవచ్చు. చంద్రకళ క్యారెక్టర్ కోసం రెడీ అవ్వడం నాకు ఎంతగానో నచ్చింది అని తెలిపింది. ఇక హైదరాబాద్ ఫుడ్ నచ్చిందా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. చాలా నచ్చింది. చాలా స్పైసీగా ఉంటుంది. ఇక్కడ బిర్యాని అంటే నాకు చాలా ఇష్టం.. రామ్ చరణ్ గారు ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. రామ్ చరణ్ గారి మగధీర సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమాని ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. ఇక తెలుగులో అల్లు అర్జున్ గారు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







