Telangana: గర్భిణీ శవాన్ని అడ్డుకున్న గ్రామ పెద్దలు.. చలిలో ఊరి బయటే అంత్యక్రియలు..!
దయనీయ ఘటన వెలుగులోకి వచ్చింది. లలిత అనే గర్భిణి అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది. మృతదేహం పట్ల ఆ గ్రామంలోని కొంతమంది పెద్దలు, వ్యవహరించిన తీరు మానవత్వాన్ని మంట కలిపింది. గర్భిణీ స్త్రీ శవాన్ని గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. మహిళ శవాన్ని ఊరి బయటనే అంత్యక్రియలు జరుపడం పలువురు హృదయాలను కదిలించింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం లింగగూడెంలో దయనీయ ఘటన వెలుగులోకి వచ్చింది. లలిత అనే గర్భిణి అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది. మృతదేహం పట్ల ఆ గ్రామంలోని కొంతమంది పెద్దలు, వ్యవహరించిన తీరు మానవత్వాన్ని మంట కలిపింది. గర్భిణీ స్త్రీ శవాన్ని గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. మహిళ శవాన్ని ఊరి బయటనే అంత్యక్రియలు జరుపడం పలువురు హృదయాలను కదిలించింది.
బొమ్మెర లలిత అనే గర్భిణీ అనారోగ్యం పాలైంది. దీంతో ఆమెను కుటుంబసభ్యులు ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 17వ తేదీన మృతి చెందింది. అయితే, లలిత శవాన్ని లింగగూడెంకు తీసుకొస్తుండగా కొంతమంది అడ్డుకున్నారు. గ్రామానికి కీడు వస్తుందని శవానికి మూఢనమ్మకానికి ముడిపెట్టి, గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. మృతురాలి బంధువులు చేసేది ఏమీ లేక లింగగూడెం ఊరు బయటనే చలిలోనే వణుకుతూ అంత్యక్రియలు నిర్వహించారు.
ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండి గ్రామ పెద్దలను ఒప్పించలేక, రాత్రికి అంత్యక్రియలు జరిపారు. లలితకు లింగగూడెంలో సొంత ఇల్లు ఉంది. భర్త ఉన్నాడు. ఆమె అనారోగ్యంతో చనిపోతే సానుభూతి చూపించాల్సిన గ్రామస్తులు, దుఃఖ సాగరంలో ఉన్న మృతురాలి బంధువులను ఇబ్బందులకు గురి చేశారు. గర్భిణీ స్త్రీ శవం గ్రామంలోకి వస్తే కీడు వస్తుందని నమ్మి గ్రామంలోకి శవాన్ని రానివ్వలేదని లలిత కుటుంబసభ్యులు తెలిపారు.
వీడియో ఇక్కడ చూడండి…
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




