AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: కుప్పకూలిన టీమిండియా.. న్యూజిలాండ్ విజయ లక్ష్యం ఎంతంటే?

న్యూజి లాండ్ తో బెంగళూరు వేదికగా జరుగుతోన్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పరాజయం అంచున నిలిచింది. నాలుగో రోజు ఆటలో సర్ఫరాజ్, రిషబ్ పంత్ మెరిసినా మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలయ్యారు. ఫలితంగా టీమిండియా 462 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

IND vs NZ: కుప్పకూలిన టీమిండియా.. న్యూజిలాండ్ విజయ లక్ష్యం ఎంతంటే?
Team India
Basha Shek
|

Updated on: Oct 19, 2024 | 5:09 PM

Share

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా అద్భత పోరాటం ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలినా రెండో ఇన్నింగ్స్‌లో ధీటుగా సమాధానం ఇచ్చింది. సర్ఫరాజ్ ఖాన్ 150, రిషబ్ పంత్ 99, విరాట్ కోహ్లీ 70, రోహిత్ శర్మ 52 పరుగులతో మెరవడంతో టీమిండియా ఓటమి బారి నుంచి బయటపడిందనుకున్నారు. కానీ నాలుగో రోజు టీ విరామం తర్వాత టీమిండియా అనూహ్యంగా కుప్పకూలింది. ఒకానొకదశలో 408/3 పటిష్టంగా కనిపించిన భారత్ చివరకు 462 పరుగులకు ఆలౌటైంది. దీంతో పర్యాటక జట్టుకు 107 పరుగుల స్వల్ప విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. జట్టులోని లోయర్ ఆర్డర్ కాసేపు ఆడితే కివీస్ లక్ష్యం మరింత ఎక్కువగా ఉండేది. కానీ కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవి చంద్రన్ అశ్విన్ పూర్తిగా నిరాశపరిచారు. ఈ ముగ్గురు ఆటగాళ్లపై జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ ఈ ముగ్గురు వచ్చిన వెంటనే పెవిలియన్ చేరి జట్టుతో పాటు అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చారు.  మరి ఇప్పుడు ఈ 107 పరుగులను టీమిండియా బౌలర్లు డిఫెండ్ చేస్తారా? లేదా? మ్యాచ్ ను న్యూజిలాండ్ కు అప్పగించేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

ఇప్పుడు 462 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఓపెనర్లు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా, పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ బాట పట్టారు. నిజానికి నాలుగో రోజుకు అరగంటకు పైగా సమయం ఉంది. కానీ  వెలుతురు లేమీ కారణంగా మ్యాచ్‌ను నిలిపివేయాలని అంపైర్ నిర్ణయించారు. దీంతో నిర్ణీత సమయానికి ముందే రోజు ముగిసింది. ఈ సమయంలో అంపైర్ నిర్ణయానికి వ్యతిరేకంగా మైదానంలో ఉన్న అంపైర్లతో టీమిండియా ఆటగాళ్లు కొంతసేపు వాగ్వాదానికి దిగారు. అయితే ఈ సమయంలో వర్షం రావడంతో వారు కూడా తిరిగి పెవిలియన్‌కు వెళ్లాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI):

టామ్ లాథమ్(కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కే.

భారత్ (ప్లేయింగ్ XI):

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..