IND vs NZ: హార్ట్ బ్రేకింగ్.. 99 పరుగుల వద్ద రిషబ్ పంత్ ఔట్.. మళ్లీ పీకల్లోతు కష్టాల్లో టీమిండియా

ఈ మ్యాచ్ లో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ బ్యాటింగ్ కు దిగుతాడా? లేదా? అని అనుమానాలు తలెత్తాయి. అయితే గాయాన్ని లెక్క చేయకుండా బరిలోకి దిగిన పంత్ ఎప్పటిలాగే దూకుడుగా ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. అయితే సెంచరీకి కేవలం ఒక పరుగు దూరంలో ఔటయ్యాడు.

IND vs NZ: హార్ట్ బ్రేకింగ్.. 99 పరుగుల వద్ద రిషబ్ పంత్ ఔట్.. మళ్లీ పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
Rishabh Pant
Follow us

|

Updated on: Oct 19, 2024 | 4:42 PM

బెంగళూరు వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా జరుగుతోంది. కాగా ఈ మ్యాచ్ నాలుగో రోజు టీమ్ ఇండియా వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ రిషబ్ పంత్ కేవలం 1 పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు. 99 పరుగులు చేసిన పంత్.. కివీస్ పేసర్ విలియం ఓ రూర్క్ వేసిన బంతిని డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ముందుగా పంత్ బ్యాట్ అంచుకు తగిలిన బంతి ఆ తర్వాత వికెట్ ను తాకింది. దీంతో పంత్ ఒక్క పరుగు తేడాతో సెంచరీని మిస్ అయ్యాడు. పంత్ ఔట్ కావడంతో స్టేడియం మొత్తం నిశబ్దమైంది. నాన్‌స్ట్రైక్‌లో ఉన్నకేఎల్ రాహుల్ కూడా దీనిని నమ్మలేక అలా కూర్చుండిపోయాడు. డగౌట్‌లో కూర్చున్న టీమ్‌మేట్స్ కూడా కాసేపు షాక్‌కు గురయ్యారు. ఇక చివరగా పంత్ తీవ్ర నిరాశతో మైదానం వీడాడు. కాగా గతంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ను నెర్వస్ 90 ఫొబియా వెంటాడేది. సచిన్ తన టెస్ట్ క్రికెట్ కెరీర్‌లో మొత్తం 10 సార్లు 90-99ల మధ్యలో ఔటయ్యాడు. ఇక రిషబ్ పంత్ ఇప్పటికే 7 సార్లు ఇలా 90 ల్లోనే పెవిలియన్ చేరాడు. దీనికి ముందు, పంత్ 97 పరుగులు, 96 పరుగులు, 93 పరుగులు, 92 పరుగులు, 92 పరుగులు, 91 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

కాగా రిషబ్ పంత్ తన టెస్టు కెరీర్‌లో 99 పరుగులు వద్ద ఔటవ్వడం ఇదే తొలిసారి. అదే సమయంలో, భారత టెస్టు క్రికెట్‌లో 12 ఏళ్ల తర్వాత, ఒక వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. అంతకుముందు 2012లో ఎంఎస్ ధోని 99 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ధోనీ 99 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత పంత్ విషయంలో ఇదే జరిగింది. ఇది కాకుండా, రిషబ్ పంత్ ఒక టెస్టులో 99 పరుగుల వద్ద ఔట్ అయిన 5వ భారత బ్యాటర్ గా నిలిచాడు. పంత్, ధోనీలతో పాటు మురళీ విజయ్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీలు కూడా 99 పరుగుల వద్ద ఔటయ్యారు.

వీడియో ఇదిగో..

మళ్లీ కష్టాల్లో టీమిండియా..

ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కేవలం 46 పరుగులకే ఆలౌటైంది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రోహిత్ పాడేరు నాలుగో రోజు టీ విరామ సమయానికి 6 వికెట్ల నష్టానికి 438 పరుగులు చేసి 82 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అయితే ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం భారత్ స్కోరు 8 వికెట్ల నష్టానికి 462/8. ఆధిక్యం కేవలం 106 పరుగులు మాత్రమే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హార్ట్ బ్రేకింగ్.. 99 పరుగుల వద్ద పంత్ ఔట్.. వీడియో చూడండి
హార్ట్ బ్రేకింగ్.. 99 పరుగుల వద్ద పంత్ ఔట్.. వీడియో చూడండి
తవ్వకాలలో బయటపడ్డ హనుమాన్ విగ్రహం.. తన్మయత్వంతో పూజలు..
తవ్వకాలలో బయటపడ్డ హనుమాన్ విగ్రహం.. తన్మయత్వంతో పూజలు..
కోట్ల ఆస్తిని పేద విద్యార్థులకు దానం చేసిన స్టార్ హీరోయిన్..
కోట్ల ఆస్తిని పేద విద్యార్థులకు దానం చేసిన స్టార్ హీరోయిన్..
దేశం టాటాకు సెల్యూట్ చేసిన వేళ.. ఈ డీల్‌కు మంచి గుర్తింపు!
దేశం టాటాకు సెల్యూట్ చేసిన వేళ.. ఈ డీల్‌కు మంచి గుర్తింపు!
గ్రూప్-1 అభ్యర్ధుల ర్యాలీలో తోపులాట..బండిసంజయ్, RSప్రవీణ్ అరెస్ట్
గ్రూప్-1 అభ్యర్ధుల ర్యాలీలో తోపులాట..బండిసంజయ్, RSప్రవీణ్ అరెస్ట్
దీపిక, అలియాలను దాటేసిన శ్రద్ధా కపూర్.. ప్రధాని మోడీ సైతం..
దీపిక, అలియాలను దాటేసిన శ్రద్ధా కపూర్.. ప్రధాని మోడీ సైతం..
మహిళా రైతుల పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది: సీఎం చంద్రబాబు
మహిళా రైతుల పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది: సీఎం చంద్రబాబు
సముద్ర తీరానికి వేలాదిగా కొట్టుకొచ్చిన మిస్టరీ బాల్స్.. ఆరా తీయగా
సముద్ర తీరానికి వేలాదిగా కొట్టుకొచ్చిన మిస్టరీ బాల్స్.. ఆరా తీయగా
డార్లింగ్ సినిమాలు రీ రిలీజ్‎ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే..
డార్లింగ్ సినిమాలు రీ రిలీజ్‎ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే..
లేడీ గెటప్‌లో సర్ ప్రైజ్ చేసిన టాలీవుడ్ నటుడు.. 
లేడీ గెటప్‌లో సర్ ప్రైజ్ చేసిన టాలీవుడ్ నటుడు..