AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shraddha Kapoor: ఆ విషయంలో దీపిక, అలియాలను దాటేసిన శ్రద్ధా కపూర్.. ప్రధాని మోడీ సైతం ఈ ముద్దుగుమ్మ తర్వాతే..

స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్ట్ 15న విడుదలైన 'స్త్రీ 2' సినిమా ఏకంగా రూ. 800 కోట్లకు పైగా వసూళ్లు  రాబట్టింది. 2018లో విడుదలైన 'స్త్రీ సినిమాకు సీక్వెల్ ఇది. శ్రద్ధా కపూర్ తో పాటు రాజ్‌కుమార్ రావ్, అభిషేక్ బెనర్జీ, తమన్నా భాటియా, వరుణ్ ధావన్, పంకజ్ త్రిపాఠి వంటి నటీనటులు ఈ సినిమాలో నటించారు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు.

Shraddha Kapoor: ఆ విషయంలో దీపిక, అలియాలను దాటేసిన శ్రద్ధా కపూర్.. ప్రధాని మోడీ సైతం ఈ ముద్దుగుమ్మ తర్వాతే..
Shraddha Kapoor
Basha Shek
|

Updated on: Oct 19, 2024 | 4:18 PM

Share

బాలీవుడ్ టాప్ నటి ఎవరనే ప్రశ్నకు దీపిక-ఆలియా అనే సమాధానం వస్తుంది. కానీ నటి శ్రద్ధా కపూర్ వీరిద్దరి కంటే పాపులర్ నటిగా ఎదుగుతోంది. పెద్ద బ్యాక్ గ్రౌండ్ లేకుండా, పెద్ద ప్రొడక్షన్ హౌస్ ల సపోర్ట్ లేకుండా తన టాలెంట్, అందంతో హిందీ సినీ ప్రియుల మనసు దోచుకుంటుందీ అందాల తార. ఇక స్ట్రీ2 సినిమా సక్సెస్ తో ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ పాపులర్ నటిగా మారిపోయింది శ్రద్ధా కపూర్. భారతదేశంలోని ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న నటిగా అరుదైన గుర్తింపు సొంతం చసుకుంది. ఈ సోషల్ మీడియా యుగంలో, ఏ వ్యక్తికైనా పాపులారిటీని ఫాలోవర్లతోనే కొలుస్తారు. భారతదేశంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నటీనటులలో శ్రద్ధా కపూర్ ఇప్పుడు అగ్రస్థానానికి చేరుకుంది. ఆమెన ఇన్‌స్టాగ్రామ్‌లో 9.36 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ఇండియాలో మరే నటుడికీ, నటికీ ఇంత భారీ ఫాలోయింగ్ లేదు. అన్నట్లు ఈ విషయంలో శ్రద్ధా కపూర్ ప్రధాని నరేంద్ర మోడీని కూడా వెనక్కి నెట్టింది. శ్రద్ధా తర్వాత రెండో ర్యాంక్‌లో ఉన్న నటి ప్రియాంక చోప్రా . ఇప్పుడు హాలీవుడ్‌లో ఉన్నప్పటికీ భారతీయ నటి కావడంతో ఆమె ఖాతాలోకి తీసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంకను 9.20 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ప్రియాంకర్ తర్వాతి స్థానంలో అలియా భట్ ఉంది. అలియాను 8.52 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. కత్రినా కైఫ్‌ నాలుగో స్థానంలో, దీపికా పదుకొణె ఐదో స్థానంలో నిలిచారు.

భారతదేశంలోనే అత్యధిక ఫాలోవర్లు ఉన్న వ్యక్తి క్రికెటర్ విరాట్ కోహ్లీనే . ఈ టీమ్ ఇండియా రన్ మెషీన్ ను 27 కోట్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఇక రెండో స్థానంలో నటి శ్రద్ధా కపూర్‌ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 9.17 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ నాలుగో స్థానంలో ఉన్నారు. విరాట్ కోహ్లి, నరేంద్ర మోడీ కాకుండా, టాప్ 10 మంది సినీ పరిశ్రమకు చెందిన వారు నటీమణులు మాత్రమే. టాప్ 10లో ఏ భారతీయ నటుడి పేరు లేదు.

శ్రద్ధా కపూర్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

ఓటీటీలోనూ స్ట్రీ 2 సినిమాకు సూపర్ రెస్పాన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us