Champions Trophy: ఆ కండీషన్‌కు మేం ఓకే.. మరి మీరు..? బీసీసీఐకి మరో ఆఫరిచ్చిన పీసీబీ.. అదేంటంటే?

India Vs Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి, మార్చి మధ్య ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఐసీసీకి పీసీబీ పంపిన షెడ్యూల్‌లో తొలి మ్యాచ్‌ని ఫిబ్రవరి 19న, ఫైనల్‌ను మార్చి 9న నిర్వహించాలనే ప్రతిపాదన ఉంది. లాహోర్, రావల్పిండి, కరాచీలను వేదికలుగా ఉంచారు.

Champions Trophy: ఆ కండీషన్‌కు మేం ఓకే.. మరి మీరు..? బీసీసీఐకి మరో ఆఫరిచ్చిన పీసీబీ.. అదేంటంటే?
Champions Trophy 2025 Final
Follow us

|

Updated on: Oct 19, 2024 | 12:04 PM

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతిపాదనను అందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. క్రిక్‌బజ్ ప్రకారం, ప్రతి మ్యాచ్ ఆడిన తర్వాత టీమ్ ఇండియా తిరిగి భారత్‌కు రావొచ్చని, పాక్ బోర్డు భారత జట్టుకు ఆమేరకు ఏర్పాట్లు చేస్తుందని పీబీసీ తెలిపింది.

తాజాగా బీసీసీఐకి పీసీబీ ఓ లేఖ రాసినట్లు నివేదికలో పేర్కొంది. భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు పాకిస్థాన్‌లో ఉండకూడదని, ప్రతి మ్యాచ్ ఆడిన తర్వాత చండీగఢ్ లేదా న్యూఢిల్లీకి తిరిగి రావాలని కోరుకుంటే, బోర్డు వారికి సహాయం చేస్తుందని పేర్కొంది. ఈ ప్రతిపాదనను పీసీబీ అధికారి ధ్రువీకరించారు. భారత్ చివరి 2 మ్యాచ్‌ల మధ్య ఒక వారం గ్యాప్ ఉండడమే ఈ ఆఫర్ ఇవ్వడానికి కారణంగా చెబుతున్నారు.

నివేదికల ప్రకారం, ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ పర్యటన సందర్భంగా, భారత జట్టు పాకిస్తాన్ వెళ్లడంపై చర్చ జరిగింది. జైశంకర్‌, పాక్‌ విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌ మధ్య జరిగిన చర్చల్లో ఈ అంశం పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ఈ పర్యటన తర్వాత పీసీబీ ఆశలు చిగురించాయి.

గత ఏడాది వన్డే ప్రపంచకప్ ఆడేందుకు పాకిస్థాన్ జట్టు భారత్‌కు వచ్చింది. ఆ తర్వాత అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

పాకిస్థాన్‌లో భారత పర్యటన..

టీమిండియా చివరిసారిగా 2008లో పాకిస్థాన్‌లో పర్యటించింది. మూడు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు 1-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో 2 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

ముంబైలో జరిగిన ఉగ్రదాడి కారణంగా భారత్ పాకిస్థాన్ వెళ్లడం లేదు. 2007-08 నుంచి భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించలేదు. 2008లో ముంబైపై ఉగ్రదాడుల తర్వాత భారత ప్రభుత్వం పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడేందుకు నిరాకరించింది. అప్పటి నుంచి ఇరు జట్లు ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లో మాత్రమే ఆడుతున్నాయి. 2013 నుంచి ఇరు జట్లు తటస్థ వేదికలపై 13 వన్డేలు, 8 టీ20 మ్యాచ్‌లు ఆడాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..