- Telugu News Photo Gallery Spiritual photos IRCTC is offering a special tour for those who want to visit Srisailam
Srisailam Tour: శ్రీశైలం టూర్ వెళ్లాలనుకుంటున్నారా..? ఐఆర్‌సీటీసీ నుంచి స్పెషల్ ఆఫర్.. ఓ లుక్కేయండి
త్వరలో పండుగలు సెలవులు రానున్నాయి. దీంతో ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు, పిల్లలతో కలిసి శ్రీశైలం టూర్‌కు వెళ్లాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. నాలుగు రోజుల పాటు ఈ టూర్ ఉంటుంది. బస్సు సౌకర్యం, హోటల్‌లో వసతి లాంటి సౌకర్యాలు అన్నీ కల్పిస్తారు.
Updated on: Dec 21, 2025 | 11:59 AM

హైదరాబాద్ నుంచి శ్రీశైలం టూర్ వెళ్లాలనుకుంటున్నారా..? ఎలా వెళ్లాలి..? బస్సు, ట్రైన్ సౌకర్యం, వసతి ఎలా అని ఆందోళన చెందుతున్నారా..? అయితే మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ టూ శ్రీశైలం టూర్ స్పెషల్ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. త్వరలో పండుగలన్నీ వస్తుండటంతో ఉద్యోగులు, పిల్లలకు సెలవులు రానున్నాయి. దీంతో శ్రీశైలం ప్లాన్ చేసుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ ఈ ప్యాకేజ్ ప్రవేశపెట్టింది.

ఈ టూర్ నాలుగు రోజులు ఉంటుంది. జనవరి 4న ఈ టూర్ ప్రారంభమవుతుంది. జనవరి 4న హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర మిమ్మల్ని పిక్ చేసుకుంటారు. తొలిరోజు చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, లుంబినీ పార్క్ సందర్శన ఉంటుంది. ఇక రెండో రోజు హైదరాబాద్ నుంచి శ్రీశైలం ప్రయాణం ఉంటుంది.

రెండో రోజు స్వామివారిని దర్శించుకున్న తర్వాత పరిసర ప్రాంతాల సందర్శన ఉంటుంది. ఇక మూడో రోజు రామోజీ ఫిల్మ్ సిటీ సందర్శన ఉంటుంది. ఇక నాలుగో రోజు బిర్లా మందిర్, గొల్కోండ కోట, కుతుబ్ షాహీ ప్రాంతాల సందర్శన ఉంటుంది.

టూర్ ముగిశాక హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల వద్ద డ్రాప్ చేస్తారు. టూర్ ధర విషయానికొస్తే.. డబుల్ షేరింగ్ రూ.19,420, ట్రిపుల్ షేరింగ్ రూ.14700గా ఉంది. ఇక చైల్డ్ విత్ బెడ్ అయితే రూ.9670, చైల్డ్ వితౌట్ బెడ్ అయితే రూ.9670గా ఉంది. ఇక హోటల్, అల్పాహారం, లంచ్, డిన్నర్ సౌకర్యం కల్పిస్తారు.

ఇక టూరిస్ట్ ప్రాంతాలను సందర్శించడానికి బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ట్రావెల్స్ ఇన్యూరెన్స్ కూడా కల్పిస్తారు. అదనపు ఆహారం, సందర్శన ప్రదేశాల ఎంట్రీ టికెట్లు, హోటళ్లలో లాండ్రీ, వ్యక్తిగత ఖర్చులు మీరే పెట్టుకోవాలి. ఈ టూర్‌కు హాజరు కావాల్సిన వారు ముందుగానే ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్లోకి వెళ్లి టికెట్లు బుకింగ్ చేసుకోవాలి.




