రైలు ప్రయాణీకులకు బిగ్ షాక్
రైల్వే ఛార్జీల పెంపును ప్రకటించింది రైల్వే శాఖ. రైలు టిక్కెట్ల సవరించిన ధరకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. డిసెంబర్ 26 నుంచి రైల్వేలు ఛార్జీల పెంపు అమలు కానుంది. సబర్బన్ రైలు ప్రయాణ ఛార్జీలు మాత్రం అలాగే ఉండనున్నాయి.

రైల్ టికెట్ చార్జీలు ఈనెల 26 నుంచి పెరుగుతాయి. ఆర్డినరీ క్లాస్‌లో 215 కి.మీ దాటితే కిలోమీటర్‌కు ఒకపైసా చొప్పున అదనపు చార్జీ చెల్లించాల్సి వస్తుంది. నాన్ ఏసీ, ఏసీ క్లాసుల్లో కిలోమీటర్‌కు 2 పైసల చొప్పున టికెట్ ధర పెరుగుతుంది. నాన్ ఏసీ రైళ్లలో 500 కి.మీ దాటితే అదనంగా 10 రూపాయల భారం పడుతుంది. చార్జీల పెంపుదలతో ఈ ఏడాది 600 కోట్ల రూపాయల అదనపు ఆదాయం లభిస్తుందని రైల్వేశాఖ తెలిపింది. ఆర్డినరీ క్లాస్‌లో 215 కి.మీలోపు టికెట్ చార్జీల్లో మార్పులేదని రైల్వేశాఖ వివరించింది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల భారం కలిపి నిర్వహణ ఖర్చులు రూ.2.63 లక్షల కోట్లకు చేరడం వల్లే చార్జీలు పెంచాల్సి వచ్చిందని రైల్వేశాఖ తెలిపింది.




