AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2026 : హిస్టరీ రిపీట్ అయితే భారత్‌కు కష్టమే.. హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా?

T20 World Cup 2026 : 2026 టీ20 ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. 2024లో వెస్టిండీస్ గడ్డపై జయకేతనం ఎగురవేసిన భారత్, ఇప్పుడు తమ స్వదేశీ గడ్డపై ఆధిపత్యాన్ని చాటాలని చూస్తోంది.అయితే, చరిత్రను ఒకసారి పరిశీలిస్తే..

T20 World Cup 2026 : హిస్టరీ రిపీట్ అయితే భారత్‌కు కష్టమే.. హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా?
T20 World Cup 2026 India Records
Rakesh
|

Updated on: Dec 21, 2025 | 12:10 PM

Share

T20 World Cup 2026 : 2026 టీ20 ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. 2024లో వెస్టిండీస్ గడ్డపై జయకేతనం ఎగురవేసిన భారత్, ఇప్పుడు తమ స్వదేశీ గడ్డపై ఆధిపత్యాన్ని చాటాలని చూస్తోంది. అయితే, చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. టీమిండియా తన టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి మూడు ప్రధానమైన రికార్డుల శాపాలు అడ్డుగా నిలుస్తున్నాయి. వాటి గురించి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.

1. ఆతిథ్య దేశానికి అందని ద్రాక్ష

క్రికెట్‌లో సాధారణంగా సొంత గడ్డపై ఆడే జట్టుకు ప్రేక్షకుల మద్దతు, పిచ్‌లపై అవగాహన ఉండటం వల్ల గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తారు. కానీ, టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇది రివర్స్ అవుతోంది. ఇప్పటివరకు జరిగిన 9 ఎడిషన్లలో ఏ ఒక్కసారి కూడా టోర్నీని నిర్వహించిన దేశం కప్పు గెలవలేదు. 2016లో భారత్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చినప్పుడు సెమీఫైనల్‌లోనే వెనుదిరిగింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి జట్లు కూడా హోస్ట్ చేసినప్పుడు టైటిల్ సాధించలేకపోయాయి. 2026లో భారత్, శ్రీలంక కలిసి ఈ టోర్నీని నిర్వహిస్తున్నాయి కాబట్టి, ఈ హోస్ట్ సెంటిమెంట్‎ను బ్రేక్ చేయడం భారత జట్టుకు మొదటి సవాల్.

2. వరుస విజయాల గండం

టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా వరుసగా రెండుసార్లు విజేతగా నిలవలేదు. భారత్, వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లు రెండేసి సార్లు ఛాంపియన్‌లుగా నిలిచినప్పటికీ, అవి ఒక టోర్నీకి, మరో టోర్నీకి మధ్య గ్యాప్ ఉంది. 2024లో భారత్ అద్భుత విజయం సాధించింది. ఇప్పుడు 2026లో మళ్లీ విజేతగా నిలిస్తే, వరుసగా రెండు ప్రపంచకప్‌లు గెలిచిన తొలి జట్టుగా టీమ్ ఇండియా సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. అయితే, గత తొమ్మిది టోర్నీల చరిత్ర చూస్తే ఏ జట్టుకూ ఇది సాధ్యపడలేదు.

3. టైటిల్ డిఫెండింగ్ కష్టం

డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి, ఆ కిరీటాన్ని కాపాడుకోవడం అనేది టీ20 ఫార్మాట్‌లో అత్యంత కష్టమైన పనిగా మారింది. ప్రతి టోర్నీలోనూ కొత్త విజేత ఆవిర్భవించడమే టీ20 వరల్డ్ కప్ స్పెషాలిటీ. 2007లో భారత్ గెలిస్తే, 2009లో పాకిస్థాన్, 2010లో ఇంగ్లాండ్ ఇలా ప్రతిసారీ టైటిల్ చేతులు మారుతూనే ఉంది తప్ప, పాత ఛాంపియన్ మాత్రం దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. గత ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగడం వల్ల జట్టుపై ఉండే ఒత్తిడిని అధిగమించి భారత్ మళ్లీ కప్పు కొడుతుందా అనేది వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రేపట్నుంచే బడి టీచర్లకు స్పెషల్ TET 2026 పరీక్షలు.. గట్టెక్కుతారా
రేపట్నుంచే బడి టీచర్లకు స్పెషల్ TET 2026 పరీక్షలు.. గట్టెక్కుతారా
నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ
నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ
కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..
కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..
చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!
చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!
ఎండిన చెరువుల్లోకి వర్షపు నీరు రాగానే పసుపు కప్పలు ఎలా వస్తాయి?
ఎండిన చెరువుల్లోకి వర్షపు నీరు రాగానే పసుపు కప్పలు ఎలా వస్తాయి?
శ్రీలంకపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే
శ్రీలంకపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే
తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
తాటి బెల్లంలో అసలైనది ఏది? నకిలీది ఏది? గుర్తించడం ఎలా..?
తాటి బెల్లంలో అసలైనది ఏది? నకిలీది ఏది? గుర్తించడం ఎలా..?
బుమ్రా ఆస్తి విలువ తెలిస్తే ఫ్యూజులు అవుట్ కావాల్సిందే
బుమ్రా ఆస్తి విలువ తెలిస్తే ఫ్యూజులు అవుట్ కావాల్సిందే
కన్న తల్లిని, కడుపున పుట్టిన కూతురిని.. ఒకే రోజు హతమార్చిన కసాయి
కన్న తల్లిని, కడుపున పుట్టిన కూతురిని.. ఒకే రోజు హతమార్చిన కసాయి
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!