AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2027: ముగిసిన హార్దిక్ ట్రేడింగ్.. బలిపశువుల్లా ఆ ఇద్దరు.. ఏ టీంలో చేరనున్నాడంటే?

Hardik Pandya trade IPL 2027: ఐపీఎల్ 2027 ట్రేడింగ్‌లో హార్దిక్ పాండ్యా కోసం ముంబై ఇండియన్స్ ప్రయత్నాలు తుదిదశకు చేరాయి. కెప్టెన్సీ షరతుతో CSK, గుజరాత్ దూరమయ్యాయి. KKR డీల్ కుదరనుండగా, హర్షిత్ రాణా, రమణదీప్ సింగ్ ముంబైకి రానున్నారు. శివమ్ డూబే, ఖలీల్ అహ్మద్‌లు ట్రేడింగ్‌పై అసంతృప్తిగా ఉన్నారు. అక్టోబర్ 11న అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

IPL 2027: ముగిసిన హార్దిక్ ట్రేడింగ్.. బలిపశువుల్లా ఆ ఇద్దరు.. ఏ టీంలో చేరనున్నాడంటే?
Hardik Pandya Trade Ipl 2027
Venkata Chari
|

Updated on: Aug 25, 2026 | 8:53 PM

Share

Hardik Pandya trade IPL 2027: ఐపీఎల్ 2027 సీజన్ ట్రేడింగ్‌లో హార్దిక్ పాండ్యాను సొంతం చేసుకోవడానికి చాలా జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. ముఖ్యంగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎలాగైనా హార్దిక్‌ను దక్కించుకోవాలనే లక్ష్యంతో ముంబై ఇండియన్స్ జట్టుతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. అయితే, ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఆయుష్ మాత్రే కావాలని పట్టుబట్టడంతో, హార్దిక్‌ను కొనుగోలు చేసే నిర్ణయం నుంచి వెనక్కి తగ్గడం తప్ప సీఎస్‌కేకు మరో మార్గం లేకపోయింది.

ఆ తర్వాత, ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సంప్రదింపులు చేసినట్లు తెలిసింది. కానీ ఢిల్లీ, రాజస్థాన్ జట్లు తమకు హార్దిక్ వద్దని స్పష్టంగా చెప్పాయంట. అయితే, కేకేఆర్ జట్టు మాత్రమే ముంబై ఇండియన్స్ జట్టుతో నిరంతరం మాట్లాడుతూనే ఉందంట.

ఆ తర్వాత, హార్దిక్ పాండ్యా నేరుగా గుజరాత్ టైటాన్స్ జట్టుతో మాట్లాడినట్లు వార్తలు వినిపించాయి. కానీ, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హార్దిక్‌ను కొనవద్దని యాజమాన్యానికి గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: SL vs IND: కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబు‌లో భారీ జంప్..?

దీని కారణంగా, ముంబై ఇండియన్స్ యాజమాన్యం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో నిరంతరం మాట్లాడుతూనే ఉందంట. ముంబై ఇండియన్స్ యాజమాన్యం హర్షిత్ రాణా, రింగు సింగ్‌లను అడగగా, కేకేఆర్ జట్టు యాజమాన్యం హర్షిత్ రాణాతో పాటు రమన్‌దీప్ సింగ్‌ను విడుదల చేయడానికి ముందుకు వచ్చింది. చర్చలు కొనసాగుతుండగా, చివరకు రమన్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలను కొనడానికి ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి.

ఈలోగా, సీఎస్‌కే, గుజరాత్ టైటాన్స్ జట్ల యాజమాన్యాలు హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేయడం గురించి ముంబై ఇండియన్స్ యాజమాన్యంతో చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, తనకు కెప్టెన్సీ ఇచ్చే జట్టులోకి మాత్రమే వెళ్తానని హార్దిక్ గట్టి నిర్ణయం తీసుకోవడంతో, ఇరు జట్లు చర్చలకు ముగిసినట్లు చెబుతున్నారు.

హార్దిక్ పాండ్యాను కేకేఆర్ జట్టుకు పంపే విషయంపై ముంబై ఇండియన్స్ యాజమాన్యం అక్టోబర్ 11న ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అంతలోపు ఇతర జట్లు మంచి ఆఫర్లతో ముందుకు వస్తే, చర్చలు జరిపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. లేకపోతే, హార్దిక్‌ను కేకేఆర్ జట్టుకు ఇచ్చేస్తారని అంటున్నారు.

ఎక్కువమంది చదివినది: Video: 0,W,4,0,W,0.. ఒకే ఓవర్లో 2 వికెట్లతో చెలరేగిన బుడ్డోడు.. సెలబ్రేషన్స్ చూస్తే ఫిదానే..!

సీఎస్‌కే యాజమాన్యం హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేయాలని ప్లాన్ చేసి, తొందరపాటు నిర్ణయం తీసుకుందని మాజీలు భావిస్తున్నారు. ఇదే క్రమంలో శివమ్ దుబే, ఖలీల్ అహ్మద్‌లు కూడా కోపంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ట్రేడ్ విషయంతో దుబే చాలా అసంతృప్తిగా ఉన్నాడంట. ఇప్పటికే బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వడం లేదు, అలాగే తనను సంప్రదించకుండా యాజమాన్యం ఏకపక్షంగా ట్రేడ్‌కు పంపే నిర్ణయం తీసుకోవడంతో దుడే అసంతృప్తిగా ఉన్నాడు.

అంతేకాకుండా, జట్టులో తనకు సరైన అవకాశం లభించలేదని ఖలీల్ అహ్మద్ కూడా అసంతృప్తిగా ఉన్నాడంట. గత సీజన్ ప్రారంభంలో కొన్ని మ్యాచ్‌లు ఆడిన తర్వాత, అతను గాయం కారణంగా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత, సీజన్ చివరిలో కూడా గాయం కారణంగా అతనికి మళ్లీ అవకాశం ఇవ్వలేదు. ఫలితంగా, ఖలీల్ అహ్మద్ ట్రేడ్‌కు వెళ్లే అంచున ఉన్నట్లు సమాచారం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us