AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాళ్లను కరివేపాకుల్లా తీసిపారేస్తావా.. గంభీర్‌ను ఏకిపారేసిన మాజీ ప్లేయర్..!

WTC 2025-27: టీ20 ప్రపంచకప్-2026లో భారత్‌కు టైటిల్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ఆ తర్వాత జట్టుకు దూరం చేయడాన్ని జాఫర్ తప్పుబట్టాడు. ప్రపంచకప్ విజయం తర్వాతే అతడిపై వేటు పడటం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మహ్మద్ షమీ విషయంలోనూ ఇదే తరహా పరిస్థితి ఉందని పేర్కొన్నాడు.

వాళ్లను కరివేపాకుల్లా తీసిపారేస్తావా.. గంభీర్‌ను ఏకిపారేసిన మాజీ ప్లేయర్..!
Wasim Jaffer Comments On Gautam Gambhir
Venkata Chari
|

Updated on: Aug 25, 2026 | 7:45 AM

Share

WTC 2025-27: టెస్టు క్రికెట్‌లో గంభీర్‌ను విమర్శించడానికి చాలా కారణాలున్నాయని, కానీ వైట్‌బాల్ క్రికెట్‌లో మాత్రం అతడిని పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదని మాజీ ఓపెనర్ వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. అయితే, కొంతమంది టీమిండియా స్టార్ ఆటగాళ్లను జట్టులో నుంచి కూరలో కరివేపాకులా తీసిపారేశారని విమర్శలు గుప్పించాడు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత సూర్యకుమార్ యాదవ్‌ను జట్టుకు దూరం చేయడం, మహ్మద్ షమీ విషయంలో అనుసరిస్తున్న విధానం సక్రమంగా లేదంటూ చెప్పుకొచ్చాడు. మరోవైపు టెస్టుల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో స్వదేశంలో ఎదురైన వైట్‌వాష్‌లు గంభీర్ కెరీర్‌పై మచ్చగా మిగులుతాయని జాఫర్ అభిప్రాయపడ్డాడు. శ్రీలంక పర్యటన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గంభీర్‌తోపాటు జట్టు కూడా మారాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశాడు. సెలక్షన్ విషయంలో జరిగే తప్పిదాలకు కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నాడు. అని వసీం జాఫర్ స్పష్టం చేశాడు.

టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ పనితీరుపై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందించాడు. టెస్టు క్రికెట్‌లో గంభీర్‌పై విమర్శలకు తావుందని చెప్పిన ఆయన.. వైట్‌బాల్ క్రికెట్‌లో మాత్రం అతడిని పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నాడు. అదే సమయంలో కొంతమంది కీలక ఆటగాళ్లను జట్టులో నుంచి కూరలో కరివేపాకులా తీసేశారని మేనేజ్‌మెంట్ తీరును ప్రశ్నించాడు.

ఎక్కువమంది చదివినది: Video: దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. అసలు సీక్రెట్ ఏంటంటే..?

గంభీర్ ఒక్కడే కాదు.. జట్టు కూడా మారాలి..

టెస్టు కోచ్‌గా గంభీర్‌తోపాటు మొత్తం జట్టులోనూ మార్పులు రావాలని జాఫర్ సూచించాడు. సెలక్షన్‌లో జరిగే తప్పిదాలకు కూడా జట్టు మూల్యం చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నాడు. ‘‘విదేశీ జట్లకు టీమిండియాను వారి స్వదేశంలో ఓడించడం అంత సులువు కాదు. అలాంటిది ఏకంగా రెండు వైట్‌వాష్‌లు. ఒకవేళ మనం ఆ సిరీస్‌ గెలిచి ఉంటే.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఇప్పుడు అగ్రస్థానంలో ఉండేవాళ్లం. టెస్టు కోచ్‌గా గంభీర్‌ ఇంకా మెరుగుపడాలి. అతడొక్కడే కాదు.. జట్టు కూడా మారాలి. అయితే, కొన్నిసార్లు సెలక్షన్‌ విషయంలో తప్పిదాల వల్ల కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుంది’’ అని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు.

ఎక్కువమంది చదివినది: Rishabh Pant: జస్ట్ 63.. ధోని రికార్డ్‌‌నే బద్దలు కొట్టిన రిషబ్ పంత్.. అదేంటో తెలుసా..?

గంభీర్ మార్గదర్శనంలో రెండు ఐసీసీ టైటిళ్లు..

గౌతమ్ గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్-2026 టైటిళ్లను గెలిచింది. అదే సమయంలో డబ్ల్యూటీసీ-2025 ఫైనల్‌కు భారత్ చేరుకోలేకపోయింది. ప్రస్తుతం టీమిండియా శ్రీలంక పర్యటనలో ఉంది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను భారత్ 165 పరుగుల తేడాతో గెలిచింది. రెండో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంపై దృష్టి పెట్టింది. ఈ సమయంలో గంభీర్ పనితీరుపై జాఫర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us