AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమావాస్య నుంచి వీరికి తిరుగే ఉండదు! ధన యోగాలు, అధికార యోగాలు పక్కా

ఈ నెల (అక్టోబర్) 10న కన్యా రాశిలో రవి, చంద్రులు కలవడం జరుగుతోంది. ఈ అమావాస్య రోజు నుంచి 26న ఏర్పడే పౌర్ణమి వరకు కొన్ని రాశుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశులకు శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. వృషభం, మిథునం, వృశ్చికం, ధనుస్సు, మకరం, మీన రాశుల వారికి ధన యోగాలు, అధికార యోగాలతో పాటు అనేక సమస్యల నుంచి, ఒత్తిళ్ల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. ఒక పదిహేను రోజుల పాటు ఈ రాశుల వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 06, 2026 | 3:30 PM

Share
వృషభం: ఈ రాశికి పంచమ స్థానంలో రవి, చంద్రులు కలవడం వల్ల ఈ రాశివారికి ఒక పదిహేను రోజుల పాటు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. అనుకోకుండా పెద్ద ఎత్తున ధన లాభం కలగడానికి అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి ఉంటుంది. రావలసిన డబ్బు, రాదనుకున్న డబ్బు కూడా పూర్తిగా చేతికి అందుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి.

1 / 6
మిథునం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రవి, చంద్రుల కలయిక వల్ల కొద్ది ప్రయత్నంతో ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. గృహ, వాహనాలు కలిగే అవకాశం కూడా ఉంది. రియల్ ఎస్టేట్ వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది.  ఆదాయం వృద్ధి చెంది ముఖ్యమైన అవసరాలు, సమస్యలు తీరిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

2 / 6
వృశ్చికం: ఈ రాశికి లాభ స్థానంలో రవి, చంద్రులు కలవడం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. అనారోగ్యాల నుంచి ఊరట లభిస్తుంది. కుటుంబ జీవితంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. ఉద్యోగంలో హోదాలు, జీతభత్యాలు పెరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.

3 / 6
ధనుస్సు: ఈ రాశికి దశమ స్థానంలో ఈ రెండు రాజయోగ గ్రహాల సంచారం వల్ల ఉద్యోగానికి సంబంధించిన ఏ వ్యవహారమైనా కలిసి వస్తుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. హోదా పెరిగే అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారే సూచనలున్నాయి. నిరుద్యో గులకు భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశీ అవకాశాలు  లభి స్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆర్థికంగా మెరుగైన స్థితికి చేరుకుంటాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

4 / 6
మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో రవి, చంద్రుల యుతి వల్ల విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోవడం, విదేశాల్లో ఉద్యోగాలు లభించడం, విదేశీ సంబంధాలు కుదరడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

5 / 6
మీనం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఈ రెండు రాజయోగ గ్రహాల కలయిక వల్ల ఆదాయం బాగా పెరిగే అవ కాశం ఉంది. ఉద్యోగంలో జీతాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు రెట్టింపయ్యే సూచనలున్నాయి. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి సంక్రమిస్తుంది. వ్యక్తిగత సమ స్యల నుంచి విముక్తి లభిస్తుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయమవుతుంది.

6 / 6
Follow Us