AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరకు వెళ్లే పర్యాటకులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. మళ్లీ అందుబాటులోకి ప్యారాషూట్ రైడ్స్

ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకులోయ సందర్శకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు హాట్ ఎయిర్ బెలూన్ సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. గాల్లో తేలియాడుతూ అరకు ప్రకృతి రమణీయ దృశ్యాలను ఆస్వాదించే అద్భుత అవకాశాన్ని ఈ సీజన్‌లో వచ్చే పర్యాటకులకు అధికారులు కల్పిస్తున్నారు. మీ సదుపాయం అరకులోని ఏ, ఏ ప్రాంతాల్లో ఉందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

అరకు వెళ్లే పర్యాటకులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. మళ్లీ అందుబాటులోకి ప్యారాషూట్ రైడ్స్
Araku Hot Air Balloon Ride
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Oct 06, 2026 | 2:59 PM

Share

ఏజెన్సీ ప్రాంతంలో ప్రకృతి సుందర దృశ్యాలు ప్రస్తుతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. చల్లటి పొగమంచు ఆహ్లాదాన్ని పంచే శీతాకాల సీజన్ ప్రారంభం కావడంతో సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పాడేరు వంజంగి, అరకు లోయలోని మాడగడ మేఘాల కొండలు భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయి. అటువంటి ప్రకృతి రమణీయతను, లోయ అందాలను ఏకంగా 300 మీటర్ల ఎత్తు నుంచి గాల్లో విహరిస్తూ వీక్షించేలా హట్ ఎయిర్ బెలూన్ పర్యాటక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు టూరిజం డెవలప్‌మెంట్ అధికారులు.

పద్మాపురం గార్డెన్స్‌లో సేవలు పునఃప్రారంభం

అరకులోని ప్రసిద్ధ ప్రాంతమైన పద్మాపురం గార్డెన్స్‌లో ఈ హాట్ ఎయిర్ బెలూన్ సేవలను జిల్లా కలెక్టర్ నిశాంతి స్వయంగా పునఃప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం ఆమె స్వయంగా బెలూన్‌లో కొద్దిసేపు గాల్లో విహరించి పరిశీలించారు. పర్యాటకులను హాట్ ఎయిర్ బెలూన్‌లో దాదాపు 300 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి, అక్కడి నుంచి లోయలు, ఎత్తయిన కొండల సుందర దృశ్యాలను తిలకించే ఏర్పాట్లు చేశారు. ప్రకృతి ప్రేమికులు ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించుకుని జీవితాంతం మధుర జ్ఞాపకాలుగా దాచుకునేందుకు ఇదో చక్కటి అవకాశం.

అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలతో నిర్వహణ

ఈ సందర్భంగా కలెక్టర్ నిశాంతి మాట్లాడుతూ.. అరకు వ్యాలీకి వచ్చే పర్యాటకులకు మరింత ఆహ్లాదకరమైన, సరికొత్త అనుభవాన్ని అందించేందుకే ఈ మెగా హాట్ ఎయిర్ బెలూన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలు పాటిస్తూ, పాడేరు ఐటీడీఏ (ITDA) భాగస్వామ్యంతో దీనిని నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. పర్యాటకులతో పాటు స్థానిక ప్రజలు కూడా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని, పద్మాపురం గార్డెన్స్‌‌లో హాట్ ఎయిర్ బెలూన్ విహార అనుభూతిని పొందాలని ఆమె పిలుపునిచ్చారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us