AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బూందీ గరిటె లేకుండానే రుచికరమైన జ్యూసీ బూందీ లడ్డును ఇలా ఈజీగా చేసేయండి

పండగలు, ఫంక్షన్లు, ఇంకా ఏ ఇతర శుభకార్యాలప్పుడైన మనం ఎక్కువగా తయారుచేసే స్వీట్లలో బూందీ లడ్డు ఒకటి. దీనిని తయారుచేయడానికి ప్రత్యేకమైన బూందీ గరిటె అవసరమని చాలామంది భావిస్తారు. అయితే, ఇంట్లో సాధారణంగా ఉండే చిల్లుల గరిటెతోనే చాలా సులభంగా, పర్ఫెక్ట్ గా, జ్యూసీగా ఉండే బూందీ లడ్డును ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

Prasanna Yadla
|

Updated on: Oct 06, 2026 | 1:10 PM

Share
పండగలు, ఫంక్షన్లు, ఇంకా ఏ ఇతర శుభకార్యాలప్పుడైన మనం ఎక్కువగా తయారుచేసే స్వీట్లలో బూందీ లడ్డు ఒకటి. దీనిని తయారుచేయడానికి ప్రత్యేకమైన బూందీ గరిటె అవసరమని చాలామంది భావిస్తారు. అయితే, ఇంట్లో సాధారణంగా ఉండే చిల్లుల గరిటెతోనే చాలా సులభంగా, పర్ఫెక్ట్ గా, జ్యూసీగా ఉండే బూందీ లడ్డును ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఇలా తయారైన లడ్డులు వారం రోజులైనా సరే సాఫ్ట్ గా, రుచిగా ఉంటాయి.

1 / 5
కావాల్సిన పదార్థాలు: రెండు కప్పులు శనగపిండి, నీళ్ళు  1¼ కప్పులు , కొంచం వంటసోడా,  రెండు కప్పులు పంచదార,  నీళ్ళు (పాకానికి) 
పచ్చ కర్పూరం  చిటికెడు కంటే తక్కువ, అర టేబుల్ స్పూన్  యాలకుల పొడి ,  వేయించిన జీడిపప్పు, కిస్మిస్,  ఒక టేబుల్ స్పూన్ నెయ్యి,  నూనె,  పసుపు రంగు ఫుడ్ కలర్ ను తీసుకోవాలి.  ముందుగా, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో జల్లెడ పెట్టి రెండు కప్పుల శనగపిండిని జల్లించుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండిలో ఉండలు లేకుండా ఉంటుంది. జల్లించుకున్న పిండిలో చిటికెడు కంటే తక్కువ వంటసోడా వేసి బాగా కలపాలి. వంటసోడా వేయడం వల్ల బూందీ చక్కగా పొంగి లడ్డు సాఫ్ట్ గా, జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా దోసపిండి కన్సిస్టెన్సీ ఉండేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమం మరీ జారుగా గాని, మరీ గట్టిగా గాని ఉండకూడదు. గరిటెలో వేసి కిందకు వదిలినప్పుడు సులువుగా జారే విధంగా ఉండాలి. పిండి బాగా కలిసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి.

కావాల్సిన పదార్థాలు: రెండు కప్పులు శనగపిండి, నీళ్ళు 1¼ కప్పులు , కొంచం వంటసోడా, రెండు కప్పులు పంచదార, నీళ్ళు (పాకానికి) పచ్చ కర్పూరం చిటికెడు కంటే తక్కువ, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి , వేయించిన జీడిపప్పు, కిస్మిస్, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, నూనె, పసుపు రంగు ఫుడ్ కలర్ ను తీసుకోవాలి. ముందుగా, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో జల్లెడ పెట్టి రెండు కప్పుల శనగపిండిని జల్లించుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండిలో ఉండలు లేకుండా ఉంటుంది. జల్లించుకున్న పిండిలో చిటికెడు కంటే తక్కువ వంటసోడా వేసి బాగా కలపాలి. వంటసోడా వేయడం వల్ల బూందీ చక్కగా పొంగి లడ్డు సాఫ్ట్ గా, జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా దోసపిండి కన్సిస్టెన్సీ ఉండేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమం మరీ జారుగా గాని, మరీ గట్టిగా గాని ఉండకూడదు. గరిటెలో వేసి కిందకు వదిలినప్పుడు సులువుగా జారే విధంగా ఉండాలి. పిండి బాగా కలిసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి.

2 / 5
స్టవ్ మీద వెడల్పుగా ఉండే పాన్ లో నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె సరైన ఉష్ణోగ్రతకు వచ్చిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే బూందీ వేయాలి. నూనె సరిగ్గా కాగకపోతే బూందీ నూనె పీల్చుకోవడమే కాకుండా, షేపు కూడా సరిగ్గా రాదు. ఇంట్లో వాడే సాధారణ చిల్లుల గరిటెను తీసుకుని, దానిపై కొద్దిగా పిండి వేసి నెమ్మదిగా గుండ్రంగా తిప్పుతూ నూనెలో పడేలా చేయాలి. ఒకేసారి ఎక్కువ పిండి వేయకూడదు. పిండి తనంతట తానుగా నూనెలో పడాలి. గరిటెను కడాయికి కొట్టాల్సిన అవసరం లేదు. బూందీ వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ నుండి హై ఫ్లేమ్ లోకి అడ్జెస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. కారప్పూస కోసం వేయించినంత క్రిస్పీగా కాకుండా, పచ్చిదనం లేకుండా, మంచి సువాసన వచ్చి, నూనెలో నురగలు తగ్గే వరకు వేయించుకుంటే సరిపోతుంది.

3 / 5
బూందీని కొలవడానికి ఏ కప్పును అయితే ఉపయోగించారో, అదే కప్పుతో రెండు కప్పుల పంచదారని తీసుకోవాలి. ఒక మందపాటి గిన్నెలో ఈ పంచదార వేసి, ఒక కప్పు నీళ్ళు పోయాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, పంచదార కరిగే వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి. పాకం ఉడుకుతున్నప్పుడు పైన ఏమైనా మలినాలు పేరుకుంటే గరిటెతో తీసివేయాలి. దీనికి గట్టిపాకం అవసరం లేదు. పాకం జిడ్డుగా, నూనెలాగా అనిపించినప్పుడు, వేళ్లతో పట్టుకుని చెక్ చేయాలి. లేత తీగపాకం వస్తే సరిపోతుంది. తీగపాకం రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి.

4 / 5
స్టవ్ ఆఫ్ చేసిన పాకంలో, మంచి సువాసన కోసం చిటికెడు కంటే తక్కువ పచ్చ కర్పూరం, అర స్పూన్ యాలకుల పొడి వేసి కలపాలి. మీరు ఫుడ్ కలర్ వాడాలనుకుంటే, ఈ దశలో చిటికెడు పసుపు రంగు ఫుడ్ కలర్ కలుపుకోవచ్చు. ఇప్పుడు వేయించి పెట్టుకున్న బూందీ మొత్తాన్ని పాకంలో వేసి, గరిటెతో కిందకి పైకి నెమ్మదిగా కలపాలి. మరీ ఎక్కువ కలపకుండా, బూందీ పాకంలో కలిసేలా చూడాలి. బూందీ పాకాన్ని పీల్చుకుని మెత్తగా నానడం కోసం, దీనిపై మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి, అడుగున పేరుకుపోయిన పాకాన్ని మరోసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మరొక పది నిమిషాలు నానబెట్టాలి.
బూందీ పాకాన్ని చక్కగా పీల్చుకున్న తర్వాత, దానిని మరీ ఓవర్ గా మిక్స్ చేయకుండా ఒకసారి కిందకి పైకి కదిలించాలి. ఇప్పుడు లడ్డు తినేటప్పుడు పంటికి తగులుతూ మంచి రుచిగా ఉండటం కోసం, వేయించిన జీడిపప్పులు, కిస్మిస్ లు, కొద్దిగా డైమండ్ షుగర్ వేసి, ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. బూందీ గోరువెచ్చగా ఉంది కాబట్టి నెయ్యిని కరిగించకుండా వేసినా చక్కగా కలిసిపోతుంది. లడ్డులు గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టుకుంటే సులువుగా వస్తాయి. మరీ చల్లారితే గట్టిపడిపోతాయి.

స్టవ్ ఆఫ్ చేసిన పాకంలో, మంచి సువాసన కోసం చిటికెడు కంటే తక్కువ పచ్చ కర్పూరం, అర స్పూన్ యాలకుల పొడి వేసి కలపాలి. మీరు ఫుడ్ కలర్ వాడాలనుకుంటే, ఈ దశలో చిటికెడు పసుపు రంగు ఫుడ్ కలర్ కలుపుకోవచ్చు. ఇప్పుడు వేయించి పెట్టుకున్న బూందీ మొత్తాన్ని పాకంలో వేసి, గరిటెతో కిందకి పైకి నెమ్మదిగా కలపాలి. మరీ ఎక్కువ కలపకుండా, బూందీ పాకంలో కలిసేలా చూడాలి. బూందీ పాకాన్ని పీల్చుకుని మెత్తగా నానడం కోసం, దీనిపై మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి, అడుగున పేరుకుపోయిన పాకాన్ని మరోసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మరొక పది నిమిషాలు నానబెట్టాలి. బూందీ పాకాన్ని చక్కగా పీల్చుకున్న తర్వాత, దానిని మరీ ఓవర్ గా మిక్స్ చేయకుండా ఒకసారి కిందకి పైకి కదిలించాలి. ఇప్పుడు లడ్డు తినేటప్పుడు పంటికి తగులుతూ మంచి రుచిగా ఉండటం కోసం, వేయించిన జీడిపప్పులు, కిస్మిస్ లు, కొద్దిగా డైమండ్ షుగర్ వేసి, ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. బూందీ గోరువెచ్చగా ఉంది కాబట్టి నెయ్యిని కరిగించకుండా వేసినా చక్కగా కలిసిపోతుంది. లడ్డులు గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టుకుంటే సులువుగా వస్తాయి. మరీ చల్లారితే గట్టిపడిపోతాయి.

5 / 5
Follow Us