AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saturn Transit: అక్టోబర్ 9న శని నక్షత్ర మార్పు.. ఈ 5 రాశులకు 83 రోజులు గోల్డెన్ డేస్! మీ రాశి ఉందా?

Shani Transit Effects Telugu: అక్టోబర్ 9న శని దేవుడు రేవతి నక్షత్రాన్ని విడిచి ఉత్తరాభద్రపద నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ మార్పు కొన్ని రాశులకు ఆర్థికంగా, వృత్తిపరంగా అనుకూల ఫలితాలను అందించవచ్చు. ఆ 5 రాశులు ఏవో వివరంగా తెలుసుకుందాం.

Rajashekher G
|

Updated on: Oct 07, 2026 | 10:58 AM

Share
Shani Nakshatra Marpu: వేద జ్యోతిషశాస్త్రంలో శని దేవుడిని న్యాయం, కర్మలకు అధిపతిగా భావిస్తారు. శని నెమ్మదిగా సంచరించే గ్రహం కావడంతో దాని రాశి, నక్షత్ర మార్పులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. 2026 అక్టోబర్ 9న సాయంత్రం 7:28 గంటలకు శని రేవతి నక్షత్రాన్ని విడిచి ఉత్తరాభద్రపదలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంచారం సుమారు 83 రోజుల పాటు కొనసాగుతుందని జ్యోతిష్య అంచనా. ఉత్తరాభద్రపదకు శని అధిపతి కావడంతో ఈ మార్పు ప్రత్యేకమైనదిగా భావిస్తారు. కర్మ, ఆర్థిక పరిస్థితి, వృత్తి, స్థిరత్వం వంటి అంశాలపై ప్రభావం ఉండొచ్చని నమ్మకం. ముఖ్యంగా వృషభం, మిథునం, కన్య, తుల, మకర రాశుల వారికి ఈ కాలం అనుకూలంగా ఉండవచ్చని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి.

1 / 6
కన్య: చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ముందుకు కదిలే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారంలో స్థిరత్వం పెరగడంతో పాటు ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.

2 / 6
మిథునం: వృత్తిపరంగా కొత్త అవకాశాలు రావచ్చు. అదనపు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలు కనిపించవచ్చు.

3 / 6
తుల: వృత్తి, ఆర్థిక రంగాల్లో అనుకూల మార్పులు చోటుచేసుకోవచ్చు. పనిలో ఎదురవుతున్న అడ్డంకులు తొలగి, కష్టానికి తగిన ఫలితాలు దక్కే అవకాశం ఉంది.

4 / 6
వృషభం: ఆర్థికంగా స్థిరత్వం పెరగవచ్చు. ఆదాయ మార్గాలు మెరుగుపడే అవకాశం ఉంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో మీ కృషికి తగిన గుర్తింపు లభించవచ్చు.

5 / 6
మకరం: శని అధిపతి గ్రహం కావడంతో ఈ నక్షత్ర మార్పు ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. వృత్తిలో స్థిరత్వం, కొత్త బాధ్యతలు లభించవచ్చు. దీర్ఘకాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. (Disclaimer: ఈ కథనంలోని వివరాలు జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పబడిన సాధారణ అంచనాలు మాత్రమే. వ్యక్తిగత ఫలితాలు జాతకంలోని గ్రహస్థితులు, దశలు, ఇతర అంశాలపై ఆధారపడి మారవచ్చు.)

6 / 6
Follow Us