AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: ఈ ఫోన్లలో వాట్సప్ బంద్.. మెటా నుంచి హెచ్చరిక.. మీ ఫోన్ కూడా ఉందో.. లేదో చూసుకోండి..

ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో పాత ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారా.. అయితే వాట్సప్ హెచ్చరిక జారీ చేసింది. పాత వెర్షన్లు వాడుతూ, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ చేసుకోనివారికి వాట్సప్ బంద్ కానుంది. ఈ మేరకు వాట్సప్ ప్రస్తుతం వీరికి యాక్సెస్ నిలిపివేస్తోంది. ఈ వివరాలు చూద్దాం,.

WhatsApp: ఈ ఫోన్లలో వాట్సప్ బంద్.. మెటా నుంచి హెచ్చరిక.. మీ ఫోన్ కూడా ఉందో.. లేదో చూసుకోండి..
Whatsapp
Venkatrao Lella
|

Updated on: Oct 07, 2026 | 10:34 AM

Share

వాట్సప్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసింది. పాడ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్ ఫోన్లు వాడుతున్న వినియోగదారులకు వాట్సప్ యాక్సెస్ నిలిపివేస్తోంది. ప్రస్తుతం ఈ భద్రతా చర్యలపై వాట్సప్ చేస్తోంది. వినియోగదారులు తమ ఫోన్లలో సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ ఉంచుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నారు. పాత సాఫ్ట్‌వేర్ల ఉన్న ఫోన్ వాడటం వల్ల హ్యాకింగ్ బారిన పడే అవకాశముంది. దీంతో వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ వారిని రక్షించే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. మీరు పాత సాఫ్ట్‌వేర్ వెర్షన్ మీ ఫోన్‌లో వాడతుంటే.. వాట్సప్ లాగిన్ చేసేటప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్డేట్ చేసుకోమని అడుగుతుంది. అప్డేట్ చేసుకుంటునే వాట్సప్‌ను యాక్సెస్ చేయడానికి వీలవుతుంది.

కొత్త సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేస్కోండి..

వినియోగదారులు వాట్సప్‌ను ఉపయోగించేముందు తమ ఫోన్‌లో తాజా సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. మీరు అప్డేట్ చేసుకోకపోతే వాట్సప్‌ను ఉపయోగించలేదు. సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేసుకోవడానికి ఎలాంటి ప్రక్రియలు ఫాలో అవ్వాలనేది కూడా స్క్రీన్‌పై కనిపించనుంది. ఆ స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా మీ ఫోన్‌లో సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేసుకోవచ్చు. సర్వర్-సైడ్ అప్‌డేట్ ద్వారా ఈ విధానాన్ని అమలు చేస్తుండగా.. వాట్సాప్ కొత్త వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్‌ వాడుతున్న కొంతమంది వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్‌లలో లాగిన్ బ్లాక్ అవుతుందనేది వాట్సాప్ వివరాలు బయటకు చెప్పలేదు. అయితే లాగిన్ అవ్వడానికి ముందు అప్డేట్ చేసుకోవాల్సిందిగా కోరడం వల్ల వినియోగదారులు అప్డేట్ చేసుకున్నట్లు వాట్సప్ నిర్ధారిస్తుంది. పాత ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లలో అవసరమైన భద్రతా తనిఖీలు ఉండకపోవచ్చు. దీని వల్ల ప్రమాదం పొంచి ఉండవచ్చు. సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేసుకోవడం వల్ల భద్రత చర్యలు మెరుగుపడతాయి. ప్రమాదం బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది.

వాట్సప్ కొత్త ఫీచర్లు

వాట్సప్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. యూజర్ల భద్రతకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తోంది. ఇటీవల సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో రూల్స్‌ను మరింత కఠినతరం చేస్తోంది. తప్పుడు సమాచారం స్ప్రెడ్ చేసేవారిపై చర్యలు తీసుకుంటుంది. వారికి వాట్సప్ వినియోగంపై పరిమితులు విధిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని భద్రతా చర్యలను తీసుకొచ్చేందుకు వాట్సప్ టెస్టింగ్ కూడా నిర్వహిస్తోంది.

Follow Us