AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఎటు చూసినా టాలీవుడ్‌ హవా.. టాప్‌10లో 6గురు మన హీరోలే! నెంబర్‌‌ 1 ఎవరో తెలుసా?

భారతీయ సినీ పరిశ్రమలో ఎప్పటికప్పుడు సమీకరణాలు మారుతూనే ఉంటాయి. దేశవ్యాప్తంగా ఏ హీరోకు ఎంత క్రేజ్ ఉంది, ఎవరి పాపులారిటీ ఏ స్థాయిలో ఉందనే అంశాలపై ప్రముఖ సంస్థ ఒర్మాక్స్ మీడియా ప్రతి నెలా జాబితాను విడుదల చేస్తుంది. తాజాగా 2025 అక్టోబరు ..

Tollywood: ఎటు చూసినా టాలీవుడ్‌ హవా.. టాప్‌10లో 6గురు మన హీరోలే! నెంబర్‌‌ 1 ఎవరో తెలుసా?
Jr Ntr And Prabhas
Nikhil
|

Updated on: Dec 21, 2025 | 12:57 PM

Share

భారతీయ సినీ పరిశ్రమలో ఎప్పటికప్పుడు సమీకరణాలు మారుతూనే ఉంటాయి. దేశవ్యాప్తంగా ఏ హీరోకు ఎంత క్రేజ్ ఉంది, ఎవరి పాపులారిటీ ఏ స్థాయిలో ఉందనే అంశాలపై ప్రముఖ సంస్థ ఒర్మాక్స్ మీడియా ప్రతి నెలా జాబితాను విడుదల చేస్తుంది. తాజాగా 2025 అక్టోబరు నెలకు సంబంధించి ప్రకటించిన టాప్ 10 ఇండియన్ మోస్ట్ పాప్యులర్ హీరోల లిస్ట్‌లో టాలీవుడ్ స్టార్ల హవా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోలు ఈ జాబితాలో అగ్రస్థానాల్లో నిలవడం విశేషం.

టాప్​లో డార్లింగ్​..

ఈ ప్రతిష్టాత్మక జాబితాలో అగ్రస్థానం గురించి మాట్లాడుకుంటే, ఎప్పటిలాగే రెబల్ స్టార్ తన నంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న ఆయనకు దేశవ్యాప్తంగా తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఇక రెండో స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో తన క్రేజ్‌ను నిలబెట్టుకోగా, మూడో స్థానంలో ఐకాన్ స్టార్ నిలిచారు. అయితే ఈ జాబితాలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం సూపర్ స్టార్, పవర్ స్టార్ల ర్యాంకులు.

చాలా కాలంగా వెండితెరకు దూరంగా ఉన్నా, రాజకీయాల్లో బిజీగా ఉన్నా కూడా పవర్ స్టార్ తన పాపులారిటీని ఏమాత్రం తగ్గించుకోలేదు. ఒర్మాక్స్ టాప్ 10 జాబితాలో ఆయన 10వ స్థానంలో నిలిచి తన సత్తా చాటారు. కేవలం సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో ఆయనపై జరుగుతున్న చర్చలు, రాజకీయ రంగంలో ఆయన సాధిస్తున్న విజయాలు కూడా ఈ పాపులారిటీకి కారణమయ్యాయి. ఇక మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు 6వ స్థానంలో నిలిచి తన స్టామినాను నిరూపించుకున్నారు. రాజమౌళితో చేయబోయే భారీ సినిమాపై ఉన్న అంచనాలు ఆయనను జాతీయ స్థాయిలో ఎప్పుడూ వార్తల్లో ఉంచుతున్నాయి.

Pawan Mahesh Ramcharan

Pawan Mahesh Ramcharan

యంగ్ టైగర్, గ్లోబల్ స్టార్..

వీరితో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ 7వ స్థానంలో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 8వ స్థానంలో నిలిచారు. ఒకప్పుడు కేవలం బాలీవుడ్ హీరోలదే పైచేయిగా ఉండే ఇలాంటి నేషనల్ సర్వేల్లో ఇప్పుడు మెజారిటీ స్థానాలను సౌత్ ఇండియన్ హీరోలు, అందునా ముఖ్యంగా తెలుగు హీరోలు ఆక్రమించడం గమనార్హం. టాప్ 10లో ఏకంగా ఆరుగురు టాలీవుడ్ హీరోలు ఉండటం మన పరిశ్రమ ఎదుగుదలకు నిదర్శనం. సోషల్ మీడియాలో ఈ ర్యాంకులపై అభిమానుల మధ్య పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మరి రాబోయే నెలల్లో ఈ స్థానాల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో వేచి చూడాలి.