AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9: ఏంటీ.! సుమన్ శెట్టికి బిగ్‌బాస్‌లో విన్నర్ కంటే భారీ రెమ్యునరేషనా.? ఎన్ని లక్షలు వచ్చాయంటే

బిగ్ బాస్ 9 టాప్ సెవెన్ కంటెస్టెంట్ సుమన్ శెట్టి తన జర్నీ గురించి చెప్పాడు. హౌస్‌లోకి ఎంట్రీ తన కుమారుడి కోరిక అని, కెప్టెన్సీ కోరిక తీరిందని వెల్లడించాడు. భరణితో స్నేహం, డైరెక్టర్ తేజ తనకు గురువు అని చెప్పుకొచ్చాడు.

Bigg Boss 9: ఏంటీ.! సుమన్ శెట్టికి బిగ్‌బాస్‌లో విన్నర్ కంటే భారీ రెమ్యునరేషనా.? ఎన్ని లక్షలు వచ్చాయంటే
Bigg Boss
Ravi Kiran
|

Updated on: Dec 21, 2025 | 1:13 PM

Share

బిగ్ బాస్ 9 రియాలిటీ షోలో టాప్ సెవెన్ కంటెస్టెంట్‌గా నిలిచి ఎలిమినేట్ అయిన సుమన్ శెట్టి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. టాప్ కమెడియన్‌గా ఐదు భాషల్లో 300కు పైగా సినిమాల్లో నటించి, నంది అవార్డు అందుకున్న సుమన్ శెట్టి, బిగ్ బాస్ హౌస్‌లో 14 వారాల పాటు తనదైన ముద్ర వేశాడు. తన బిగ్ బాస్ ఎంట్రీ వెనుక తన కుమారుడు గౌతమ్ శెట్టి కోరిక ఉందని సుమన్ శెట్టి తెలిపాడు. తన కొడుకు కోరిక మేరకే హౌస్‌లోకి వెళ్లానని అన్నాడు. తన భార్య లాస్య పూర్తి మద్దతు వల్లే తాను ఇంత దూరం వచ్చానని తెలిపాడు. హౌస్‌లోకి వెళ్లిన తర్వాత ప్రతి ఒక్క కంటెస్టెంట్ లాగే తాను కూడా మొదట కెప్టెన్ అవ్వాలని కోరుకున్నానని, ఆ కోరిక నెరవేరిందని చెప్పాడు. తర్వాత టాప్ ఫైవ్‌లో ఉండాలని, చివరికి కప్పు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నానని వివరించాడు. టాప్ ఫైవ్‌కి చేరుకోలేకపోయినా, పాజిటివ్‌గా వెళ్లి పాజిటివ్‌గా బయటకు వచ్చినందుకు సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నాడు.

ఇది చదవండి: మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది.. 10 నిమిషాల్లోనే.!

బిగ్ బాస్ హౌస్‌లో మిస్టర్ కూల్‌గా పేరు తెచ్చుకున్న సుమన్ శెట్టి, రెండు సందర్భాలలో తన కోపాన్ని చూపించినట్లు ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు. కళ్యాణ్ తో జరిగిన గొడవ, అలాగే సంజన విషయంలో “పూసేయ్ పూసేయ్ కలర్ పూసేయ్” అనే టాస్కులో తాను ఆగ్రహం వ్యక్తం చేసిన తీరుపై వివరణ ఇచ్చాడు. తప్పు లేకుండా తప్పు అంటే ఎవరూ సహించలేరని, వంద శాతం తప్పు ఉంటే మౌనంగా ఉంటామని, కానీ తప్పు లేకుండా నింద వేస్తే సహజంగానే కోపం వస్తుందని అతడు స్పష్టం చేశాడు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లే ముందే భరణి అన్నతో పరిచయం ఉందని, షూటింగ్‌ల సమయంలో ఒకే క్యారీ వ్యాన్, ఒకే బెడ్ పంచుకున్నామని తెలిపాడు. హౌస్‌లో మొదటి రోజు నుంచే తమ మధ్య స్నేహం మరింత బలపడిందని, ఒకే బెడ్ పంచుకోవడం ద్వారా ఇంకా క్లోజ్ అయ్యామని చెప్పాడు. డైరెక్టర్ తేజ తన గురువు, దేవుడి అని అన్నాడు. తాను ఈ స్థితిలో ఉండటానికి కారణం తేజ అని, ఆయన తన తొలి సినిమా అవకాశాన్ని ఇచ్చి, తనను ప్రోత్సహించారని కృతజ్ఞతలు తెలిపాడు. కాగా, బిగ్ బాస్‌లో అత్యధికంగా సుమన్ శెట్టి 14 వారాలకు గానూ రూ. 44 లక్షలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంటే ప్రతీ వారం సుమారు రూ. 3.14 లక్షలు తీసుకున్నాడని టాక్.

ఇది చదవండి: నన్నైతే అమ్మ, తమ్ముడు ముందే బట్టలు విప్పి చూపించమన్నారు.. టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

రైలులో ట్రాన్స్‌జెండర్‌ ముందు ఏడ్చిన యువకుడు..ఆమె చేసిన పనికి..
రైలులో ట్రాన్స్‌జెండర్‌ ముందు ఏడ్చిన యువకుడు..ఆమె చేసిన పనికి..
Chanakya Niti: ఈ రెండు గుణాలుంటే మీరు జీవితంలో ఓడిపోరు!
Chanakya Niti: ఈ రెండు గుణాలుంటే మీరు జీవితంలో ఓడిపోరు!
వీరికి నిమ్మకాయ విషంతో సమానం.. దూరం పెట్టకపోతే నేరుగా అక్కడికే..
వీరికి నిమ్మకాయ విషంతో సమానం.. దూరం పెట్టకపోతే నేరుగా అక్కడికే..
సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిగా చేయొచ్చు..!
సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిగా చేయొచ్చు..!
ఈ 6 పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకండి..
ఈ 6 పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకండి..
అచ్చ తెలుగమ్మాయి.. హీరోయిన్ మెటీరియల్ బాసూ.. ఎవరంటే..
అచ్చ తెలుగమ్మాయి.. హీరోయిన్ మెటీరియల్ బాసూ.. ఎవరంటే..
ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?
ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?