AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

మైనర్ బాలికను ఇద్దరు యువకులు వేధించారు. ప్రేమించకపోతే చంపేస్తామని బెదిరించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించారు. న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది..? అసలు ఏమైంది..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Andhra Pradesh: కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
Sattenapalli Minor Girl Harassment Case
Krishna S
|

Updated on: Dec 21, 2025 | 12:20 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఒక మైనర్ బాలికను ఇద్దరు యువకులు వేధింపులకు గురిచేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. తనను ప్రేమించకపోతే యాసిడ్ పోసి చంపేస్తామంటూ యువకులు ఒక బాలికను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి నిందితులను కటకటాల వెనక్కి పంపారు. సత్తెనపల్లి పట్టణానికి చెందిన ఒక మైనర్ బాలికను గత కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన కోటేశ్వరరావు, చిన్న కోటయ్య అనే ఇద్దరు యువకులు వేధిస్తున్నారు. సదరు బాలిక ఎక్కడికి వెళ్లినా వెంటపడటం, మాటలతో వేధించడం వంటివి చేస్తూ ఇబ్బంది పెట్టేవారు. నిందితుల వేధింపులు శృతిమించడంతో.. బాలిక వారిని నిలదీసింది. దీంతో ఆగ్రహించిన ఆ యువకులు.. తమను ప్రేమించకపోతే ముఖంపై యాసిడ్ పోసి చంపేస్తాం అంటూ బెదిరింపులకు దిగారు.

రంగంలోకి పోలీసులు

తమ బిడ్డకు ప్రాణహాని ఉందని గ్రహించిన బాలిక తల్లిదండ్రులు వెంటనే సత్తెనపల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, నిందితులు కోటేశ్వరరావు, చిన్న కోటయ్యలను అరెస్ట్ చేశారు. మైనర్ బాలికను వేధించినందుకు గాను వీరిపై పోక్సో చట్టం కింద, హత్య బెదిరింపుల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు వారిని జైలుకు తరలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
2026లో బంగారం ధరలు ఎంతవరకు పెరుగుతాయంటే..? షాకింగ్ న్యూస్..
2026లో బంగారం ధరలు ఎంతవరకు పెరుగుతాయంటే..? షాకింగ్ న్యూస్..