జమ్మూకశ్మీర్‌లో డ్రోన్ల కలకలం.. నియంత్రణ రేఖ వద్ద దాడులు
జమ్మూకశ్మీర్‌లో డ్రోన్ల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఆదివారం రాత్రి డ్రోన్ల దాడులు చోటుచేసుకున్నాయి. నియంత్రణ లేఖ వెంబడి పాకిస్తాన్ డ్రోన్లపై మన సైన్యం కాల్పులు జరిపినట్లు భారత బలగాలు ధృవీకరించాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

జమ్మూకాశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం రేగింది. నౌషెరా సెక్టార్‌లో నియంత్రణ రేఖ సమీపంలో ఆదివారం సాయంత్రం పాకిస్తాన్ డ్రోన్‌పై భారత సైన్యం కాల్పులు జరిపింది. ఈ దాడుల్లో మరిన్ని డ్రోన్‌లను గుర్తించినట్లు భారత భద్రతా బలగాలు ధృవీకరించాయి. డ్రోన్లు తుపాకులు లేదా మాదకద్రవ్యాలను జారవిడిచాయా? అని తనిఖీ చేయడానికి సైన్యం ఆ ప్రాంతంలో పరిశీలిస్తోంది. శనివారం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ వైపు నుండి వచ్చిన డ్రోన్ సాంబా సెక్టార్‌లో ఆయుధాల సముదాయాన్ని జారవిడిచింది. మెషిన్ గన్లు డ్రోన్లను లక్ష్యంగా చేసుకున్నాయని భారత సైన్యం తెలిపింది.
ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్లీ..
గత ఏడాది ఆపరేషన్ సింధూర్ సందర్భంలో పాక్ సైన్యం భారత్‌పై డ్రోన్లతో విరుచుకుపడింది. అప్పట్లో పాక్ డ్రోన్లను భారత్ సైన్యం తిప్పికొట్టింది. ఆ డ్రోన్లు అన్నింటినీ కూల్చివేసింది. ఆ తర్వాత డ్రోన్ల దాడులు తగ్గిపోగా.. ఆదివారం ఒకేసారి ఐదు పాకిస్థానీ డ్రోన్లు చొరబడటం కలకలం రేపుతోంది. అయితే భారత భూభాగంపై ఆయుధాలు, మాదకద్రవ్యాలను వదలడంతో పాటు ఉగ్రవాద గ్రూపులకు సపోర్ట్ చేయడానికి పాకిస్తాన్ డ్రోన్లను ఉపయోగించుకుంటోంది.
