Ravi Babu : ఉదయ్ కిరణ్ ఆ సినిమా చేయను అన్నాడు.. కోపంతో ఆ నిర్ణయం తీసుకున్నా.. రవిబాబు..
సినీరంగంలో విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ రవిబాబు. దివంగత నటుడు చలపతిరావు కొడుకుగా తెరంగేట్రం చేసి నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా బ్యాక్ టూ బ్యాక్ విభిన్న కంటెంట్ చిత్రాలతో మెప్పిస్తున్నాడు. అయితే ఓ సినిమాను ఉదయ్ కిరణ్ తో తెరకెక్కించాలని అనుకున్నారట. కానీ ఆయన చేయను అని చెప్పడంతో ఊహించని నిర్ణయం తీసుకున్నాడట.

టాలీవుడ్ ఇండస్ట్రీలో వెర్సటైల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ రవిబాబు. ఎన్నో చిత్రాలతో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన వ్యక్తిగత జీవితంలోని కీలక అంశాలను వెల్లడించారు. అలాగే తన కెరీర్ లో సోగ్గాడు సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమాను రూ. 2.75 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా.. తొలి వారంలో రూ. 1.50 కోట్లు, రెండో వారంలో రూ. 70-75 లక్షలు వసూలు చేసిందని, శాటిలైట్ హక్కుల ద్వారా కూడా లాభాలు తెచ్చిపెట్టిందని అన్నారు. సోగ్గాడు చిత్రం వాస్తవానికి ఆ కాలంలో అగ్రతారలైన తరుణ్, ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్‌లతో చేయాలని ప్లాన్ చేసుకున్నానని అన్నారు. సినిమా చేయడానికి తరుణ్, ఆర్తి అగర్వాల్‌లు సినిమా చేయడానికి అంగీకరించగా, ఉదయ్ కిరణ్ మాత్రం ఒప్పుకుంటానని, చేయనని పలుమార్లు తన నిర్ణయాన్ని మార్చుకున్నారని చెప్పారు. ఉదయ్ కిరణ్ మద్రాస్‌లో సినిమా చేస్తానని చెప్పడంతో, రవిబాబు సురేష్ బాబుకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. అయితే, సురేష్ బాబును కలిసిన ఉదయ్ కిరణ్ అనూహ్యంగా సినిమా చేయనని చెప్పడంతో రవిబాబు, సురేష్ బాబు ఇద్దరూ ఆశ్చర్యపోయారు.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
దీంతో కోపంతో “నువ్వు చేయకపోతే ఏంటి, ఇంకెవరినో పెట్టి నేను చేస్తాను” అని తాను తీసుకున్న నిర్ణయమే సినిమా ప్లాప్ కావడానికి కారణమని అన్నారు. ఉదయ్ కిరణ్ స్థానంలో హిందీ నటుడు జుగల్ హన్స్‌రాజ్‌ను తీసుకువచ్చినట్లు తెలిపారు. సోగ్గాడు అసలు క్లైమాక్స్ చాలా భిన్నంగా ఉండేదని రవిబాబు చెప్పారు. రైల్వే స్టేషన్‌లో రెండు వేర్వేరు దిశల్లో వెళ్లే రైళ్లలో తరుణ్, ఉదయ్ కిరణ్ ఉంటారు. అమ్మాయి తరుణ్ దగ్గరికి వచ్చి తన మొదటి ప్రేమ ఉదయ్ కిరణ్ అని, తరుణ్ కేవలం సహాయం మాత్రమే చేశాడని చెబుతుంది. తరుణ్ కూడా ఉదయ్ కిరణ్ వద్దకే వెళ్లమని సలహా ఇస్తాడు. అయితే ఉదయ్ కిరణ్, తరుణ్ అంత గొప్పవాడు కాదని, తనకంటే తరుణే అమ్మాయిని బాగా చూసుకుంటాడని చెప్పడంతో అమ్మాయి ఎటు వెళ్లాలో తెలియక మధ్యలో కూర్చుని ఏడుస్తూ ఉంటుందని, చివరకు ఆమె ముందు గులాబీ పువ్వు పడుతుందని, అది ఎవరు వేసిందీ చెప్పకుండా సినిమా ముగుస్తుందని అసలు క్లైమాక్స్ వివరించారు. అయితే, ప్రిడిక్టబిలిటీ కారణంగా ఈ క్లైమాక్స్ మార్చాల్సి వచ్చిందని, అది తామంతా కలిసి చేసిన తప్పేనని రవిబాబు అంగీకరించారు. కష్టమైనా, నష్టమైనా ఉదయ్ కిరణ్‌నే ఒప్పించి ఉండాలని లేదా అసలు సినిమానే తీసి ఉండకూడదని అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
ఉదయ్ కిరణ్, తరుణ్ ఒకే స్థాయి నటులు కావడం వల్ల వారి మధ్య ఒక అమ్మాయి ఉన్న ప్రేమకథ ఆసక్తికరంగా ఉండేదని, అయితే జుగల్ హన్స్‌రాజ్‌ను పెట్టడం వల్ల కథలో అసమతౌల్యం ఏర్పడిందని, అమ్మాయి తరుణ్‌తోనే వెళ్తుందని ప్రేక్షకులు సులువుగా ఊహించగలిగారని రవిబాబు వివరించారు.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
