96 కిలోల నుంచి 45 కిలోలకు తగ్గిన హీరోయిన్.. ఏం చేసిందంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
సినీరంగంలో హీరోయిన్లుగా వెలగాలంటే ప్రతిభతోపాటు అందం, ఫిట్నెస్ కూడా ముఖ్యమే. వయసు పెరుగుతున్నప్పటికీ ఫిట్నెస్ పై శ్రద్ధ ఉంటేనే కొన్నా్ళ్లపాటు రాణిస్తారు.
అయితే చాలా మంది హీరోయిన్స్ బరువు పెరిగినా, లుక్స్ మార్చిన ఇండస్ట్రీలో ఫేడవుట్ అవుతుంటారు. కానీ సినిమాల్లోకి రాకముందు బొద్దగా ఉన్న హీరోయిన్ గురించి తెలుసా..
సినిమాల్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలగాలని బరువు పూర్తిగా తగ్గిపోయింది. దాదాపు 96 కిలోల వరకు ఉండి బొద్దుగా ఉన్న ఆమె ఇప్పుడు 45 కిలోలకు చేరుకుంది.
ఆమె మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్. ఇండస్ట్రీలోకి రాకముందు ఆమె ఏకంగా 96 కిలోల బరువు ఉండేవారట. ఊబకాయంతో ఇబ్బందిపడ్డారట సారా.
పీసీవోడీ (పోలిస్టిక్ ఓవరియాన్ డిసీజ్), ఊబకాయం సమస్యలతో ఇబ్బంది పడింది. అదే సమయంలో ఎన్నో అవమానాలు, విమర్శలు కూడా తనకు వచ్చాయని తెలిపింది సారా.
కానీ ఫిట్నెస్ పై శ్రద్ధ పెట్టి ఎంతో కష్టపడ్డారట. శరీరాన్ని డీటాక్షిన్ చేసే గ్రీన్ టీ, లెమన్ టీతోపాటు ఆహారం, కార్డియో, యోగా, స్ట్రెంత్ ట్రైనింగ్ తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది.
జీవనశైలి, ఆహారపు అలవాట్లు మార్చుకుని.. శ్రద్ధగా శ్రమిస్తే ఎవరైనా బరువు అదుపులోకి తీసుకురావచ్చని.. తమ శరీరాన్ని తమకు నచ్చినట్లు మార్చుకోవచ్చని తెలిపింది.
ప్రస్తుతం సారా అలీ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్. విభిన్న కథలు.. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంది.