Actress : చేసిందే 3 సినిమాలు.. ఇండస్ట్రీనే షేక్ చేసింది.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకున్న హీరోయిన్..
చిన్న వయసులోనే నటిగా తెరంగేట్రం చేసింది. తక్కువ వయసులోనే ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. కేవలం మూడు సినిమాలతోనే సంచలనం సృష్టించింది. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిన ఆమె.. చివరకు 25 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకుని ఈ లోకం విడిచి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆమె పేరు ఇండస్ట్రీలో మరోసారి మారుమోగుతుంది.

సినీరంగుల ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన తారలు చాలా మంది ఉన్నారు. చాలా మంది నటీమణులు ప్రసిద్ధ నటి కావాలనే కలతో సినిమాల్లోకి అడుగుపెట్టి తమ కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది నటీమణుల కలలు నిజమవుతాయి. కానీ తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న తారలు.. ఆకస్మాత్తుగా చాలా మంది ప్రముఖులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి కేవలం మూడు సినిమాల్లోనే నటించింది. కానీ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో ఆమె సన్నిహిత సన్నివేశం కారణంగా నటి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత, నటి వెనక్కి తిరిగి చూడలేదు.బాలీవుడ్‌లో తనకంటూ ఒక పేరు తెచ్చుకుంటున్న సమయంలో, ఆ నటి జీవితంలో ఒక పెద్ద తుఫాను వచ్చి, అంతా ఒక్క క్షణంలో ముగిసింది. వెంటనే తన జీవితాన్ని ముగించుకుంది.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
ఆమె పేరు జియా ఖాన్. అసలు పేరు నఫీసా రిజ్వీ ఖాన్. 1998లో విడుదలైన ‘దిల్ సే’ చిత్రంలో జియా ఒక చిన్న పాత్ర పోషించింది. కానీ ఆ నటి ‘నిశబ్ద్’ చిత్రంతో తనదైన ముద్ర వేసింది. ఈ చిత్రంలో, జియా బిగ్ బితో కలిసి నటించింది. ఆ సినిమా 2007లో విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. అఫ్తాబ్ శివదాసాని, శ్రద్ధా ఆర్య వంటి నటులు కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఆమె నటుడు అమీర్ ఖాన్ చిత్రం ‘గజిని’లో కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. కానీ 2010లో విడుదలైన ‘హౌస్‌ఫుల్’ చిత్రం జియా చివరి చిత్రం.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
జియా ఖాన్ జూన్ 3, 2013న మరణించారు. ఆమె మృతదేహం ముంబైలోని ఆమె ఇంట్లో కనుగొనబడింది. నటి చాలా చిన్న వయసులోనే తన జీవితాన్ని ముగించుకుంది. ఆ సమయంలో జియా వయస్సు కేవలం 25 సంవత్సరాలు. ఆమె మరణం తర్వాత, సూసైడ్ నోట్‌లో ఒక షాకింగ్ కారణం వెలుగులోకి వచ్చింది, అందులో ఆమె సూరాజ్ పంచోలితో తన ప్రేమ, ఆమె గర్భస్రావం, కెరీర్ సంబంధిత సమస్యలను ప్రస్తావించింది. సూరజ్‌పై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు విమర్శలు వచ్చాయి. కానీ 2023లో కోర్టు అతడిని నిర్దోషిగా విడుదల చేసింది.

Jiah Khan Films
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
