AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Prices: నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. పండగ వేళ ఒక్కసారిగా పెరిగిన నాటుకోడి.. కేజీ ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో పండుగల సమయాల్లో నాటుకోడి మాాంసం తినేందుకు ఎక్కువమంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. దీంతో వీటి ధరలు పెరుగుతుంటాయి. మరో కొద్ది రోజుల్లో తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేస్తుంది. ఇప్పటినుంచి రెండు రాష్ట్రాల్లో పండుగ శోభ నెలకొంది. ఈ తరుణంలో..

Chicken Prices: నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. పండగ వేళ ఒక్కసారిగా పెరిగిన నాటుకోడి.. కేజీ ఎంతంటే..?
Natukodi Chicken
Venkatrao Lella
|

Updated on: Jan 11, 2026 | 7:01 PM

Share

సంక్రాంతి పండుగ వేళ సామాన్య, మధ్యతరగతి ప్రజలకు షాక్ తగిలింది. పండుగ సందర్భంగా ప్రతీఒక్కరూ తమ ఇంట్లో చికెన్, మటన్ వండుకుంటూ ఉంటారు. ఇక అతిధులకు కూడా రకరకరాల నాన్ వెజ్ వంటకాలు వడ్డిస్తారు. సంక్రాంతి పండుగ సమయాల్లో బాయిలర్ చికెన్ కంటే మటన్, నాటుకోడి చికెన్ ఎక్కువగా తింటారు. అంతేకాకుండా సంక్రాంతికి నాటుకోడి వండుకోవడం, గ్రామ దేవతలకు నాటుకోడితో మెక్కులు చెల్లించడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. దీంతో పండగ వేళ డిమాండ్ పెరగడంతో నాటుకోళ్ల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. నాటుకోళ్ల ఉత్పత్తి పెరిగిపోవడం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వీటి ధరలు భారీగా పెరిగాయి. దీంతో పండక్కి నాటుకోడి మాంసం వండుకోవాలంటే భయపడే పరిస్థితికి సామాన్యులు వచ్చేశారు.

కేజీ నాటుకోడి ధర ఎంతో తెలుసా..?

కేజీ నాటుకోడి దాదాపు రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు పలుకుతోంది. సాధారణ రోజుల్లో రూ.800గా వీటి ధర ఉండేది. ఇప్పుడు పండుగ సీజన్ కావడంతో రూ.2 వేలకు చేరుకుంది. అంత ధర పెట్టి సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. గోదావరి జిల్లాలతో పాటు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో నాటుకోళ్లకు ఫుల్ డిమాండ్ పెరగడంతో ధరలు ఆమాంతం పెరిగాయి. ఇక పందెం కోళ్ల ధరలు అయితే రూ.లక్షల్లోనే ఉన్నాయి. ఇక హైదరాబాద్‌లో కేజీ నాటుకోడి రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు ఉంది. అటు నాటుకోడి ధర ఇలా ఉండగా.. బాయిలర్ చికెన్ ధరలు కూడా పెరుగుతున్నాయి. కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ.340కి చేరుకుంది. గత నెలలో రూ.230గా ఉన్న ధరలు ఇప్పుడు రూ.100 మేర పెరిగాయి. పండక్కి వివిధ ప్రాంతాలకు సరఫరా పెరగడమే దీనికి కారణంగా తెలుస్తోంది.

కేజీ చికెన్ ఎంతంటే..?

హైదరాబాద్, విజయవాడతో పాటు వరంగల్‌లో కేజీ చికెన్ రూ.340 మధ్య పలుకుతోంది. ఇక ఏపీలో కొన్ని జిల్లాల్లో రూ.300 వరకు ఉంటుంది. రానున్న వారంలో పండుగ ఉండటంతో ధరలు మరింతగా పెరిగే అవకాశముందని తెలుస్తోంది. మరో నెల పాటు ఇవే ధరలు కొనసాగే అవకాశముందని పాల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. ఆ తర్వాత దిగొచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. దాణా ఖర్చులు పెరగడం, ఫామ్స్ నిర్వహణ ఖర్చులు పెరగడంతో ధరలను పెంచాల్సి వస్తుందని చెబుతున్నారు.  అటు కేజీ మటన్ రూ.800 నుంచి రూ.900 వరకు పలుకుతోంది. మటన్‌ను దాటి నాటుకోడి మాంసం ధరలు పెరిగాయి.

పండక్కి నాటుకోడి తినాలంటే జేబు ఖాళీనే.. వామ్మో ధరలు మరీ ఇంతలా..
పండక్కి నాటుకోడి తినాలంటే జేబు ఖాళీనే.. వామ్మో ధరలు మరీ ఇంతలా..
జుట్టు వేగంగా పెరగాలంటే ఏం చేయాలి?ఈ సింపుల్‌ టిప్స్ ట్రై చేశారంటే
జుట్టు వేగంగా పెరగాలంటే ఏం చేయాలి?ఈ సింపుల్‌ టిప్స్ ట్రై చేశారంటే
టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో మైదానం వీడిన స్టార్ ప్లేయర్
టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో మైదానం వీడిన స్టార్ ప్లేయర్
విజయవాడలో సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
విజయవాడలో సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
మౌని అమావాస్యనాడు పూర్వీకులు కలలోకి వస్తే.. శుభమా? అశుభమా?
మౌని అమావాస్యనాడు పూర్వీకులు కలలోకి వస్తే.. శుభమా? అశుభమా?
120 వీధికుక్కలను పాతిపెట్టిన ఘటన.. 9 మందిపై కేసులు
120 వీధికుక్కలను పాతిపెట్టిన ఘటన.. 9 మందిపై కేసులు
మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు నయనతార ఎంత తీసుకుంటుందంటే..
మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు నయనతార ఎంత తీసుకుంటుందంటే..
సంక్రాంతి కోడిపందాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
సంక్రాంతి కోడిపందాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
చైనా మాంజా తగిలి సాప్ట్‌వేర్ ఇంజనీర్ మెడకు గాయాలు
చైనా మాంజా తగిలి సాప్ట్‌వేర్ ఇంజనీర్ మెడకు గాయాలు
తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరుస్తున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు
తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరుస్తున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు