కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఒక్క సినిమాతో కనిపించకుండా పోయింది..
Rajitha Chanti
Pic credit - Instagram
ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్స్ అయిన తారలు చాలా మంది ఉన్నారు. కానీ తొలి చిత్రం తర్వాత వరుస అవకాశాలు కాకుండా ఇండస్ట్రీకి దూరమయ్యారు పలువురు హీరోయిన్స్.
అందులో నేహా శెట్టి ఒకరు. తక్కువ సమయంలోనే తెలుగులో తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. చేసిన ఒకటి రెండు సినిమాలతోనే కుర్రాళ్ల ఆరాధ్య దేవతగా మారింది.
ముఖ్యంగా డీజే టిల్లు సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిప్పింది. ఈ ఒక్క సినిమాతో తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ తర్వాతే ఆమె పరిస్థితి మారిపోయింది.
డీజే టిల్లు తర్వాత ఆమెకు ఎక్కువగా అవకాశాలు రాలేదు. బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆడపాదడపా సినిమాల్లో కనిపించింది. కానీ ఆశించిన స్థాయిలో హిట్టు అందుకోలేకపోయిది.
ఇప్పుడు సినిమాలు ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తుంది. కర్నాటకకు చెందిన నేహా శెట్టి నటనపై ఆసక్తితో మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది.
ముంగారు మేల్ 2 అనే కన్నడ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన ఆమె.. తర్వాత పూరీ ఆకాష్ నటించిన మెహబూబా మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
గ్లామర్ తోపాటు యాక్టింగ్ తోనూ మంచి పేరు సంపాదించుకుంది. టాలీవుడు ఇండస్ట్రీలో ఫస్ట్ మూవీ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ త్వరలోనే గుర్తింపు తెచ్చుకుంది.
డీజే టిల్లు సినిమా తర్వాత మాత్రం ఆమె చిత్రాల్లో అంతగా కనిపించడం లేదు. అటు సోషల్ మీడియాలోనూ ఎక్కువగా పోస్టులు చేయడం లేదు. ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యంది.