AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: లేడీ గెటప్‌లో సర్ ప్రైజ్ చేసిన టాలీవుడ్ నటుడు.. డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

ఈ ఫొటోలో ఉన్న నటుడిని గుర్తు పట్టారా? స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా కనిపించిన ఈ నటుడు హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. అయితే సినిమా ప్లాఫ్ అవ్వడంతో హీరో రోల్స్ జోలికి వెళ్లలేదు. విలన్ గా, సహాయక పాత్రలతో టాలీవుడ్ ఆడియెన్స్ ను మెప్పిస్తున్నాడు.

Tollywood: లేడీ గెటప్‌లో సర్ ప్రైజ్ చేసిన టాలీవుడ్ నటుడు.. డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
Tollywood Actor
Basha Shek
|

Updated on: Oct 19, 2024 | 3:48 PM

Share

సినిమాల్లోని పాత్రల కోసం తమను తాము మార్చుకునే నటులు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. జుట్టు, గడ్డం భారీగా పెంచడం, బరువు పెరగడం, సిక్స్ ప్యాక్ బాడీ మెయింటైన్ చేయడం.. ఇలా పాత్రలకు తగ్గట్టుగా మారిపోతుంటారు చాలా మంది యాక్టర్స్. అయితే సినిమాల కోసం లేడీ గెటప్పులు వేసే హీరోలు చాలా తక్కువ మందే ఉంటారు. అందుకు చాలా కారణాలున్నాయి. చంటబ్బాయి సినిమాలో చిరంజీవి, మల్లన్న సినిమాలో విక్రమ, పుష్ప2 సినిమాలో అల్లు అర్జున్.. తదితర హీరోలు లేడీ గెటప్పుల్లో అభిమానులను అలరించారు. తాజాగా మరో టాలీవుడ్ నటుడు లేడీ గెటప్‌తో అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. పై ఫొటో అదే. మరి ఈ నటుడు ఎవరో గుర్తు పట్టారా? ఇతను సుమారు ఇరవై ఎళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. విలన్ గా, సహాయ నటుడిగా వందలాది చిత్రాల్లో నటించి మెప్పించాడు. హీరోగానూ ట్రై చేశాడు కానీ క్లిక్ అవ్వలేకపోయాడు. రవితేజ నటించిన ‘విక్రమార్కుడు’ సినిమాలో టిట్లా పాత్రతో టాలీవుడ్ ఆడియెన్స్ ను భయటపెట్టిన ఈ నటుడు మరెవరో కాదు అజయ్. అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటిస్తోన్న పొట్టేల్ సినిమాలో ఈ నటుడు కూడా ఒక కీలక పాత్ర పోషించాడు.

సాహిత్‌ మోత్కూరి తెరకెక్కించిన పొట్టేల్ సినిమాలో అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ ప్రధాన పాత్రలు పోషించాడు. అజయ్ విలన్ పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆద్యంతం ఆకట్టుకునేలా సాగిన ఈ ట్రైలర్ లో అజయ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. మరీ ముఖ్యంగా ట్రైలర్ ఎండింగ్ లో ఏకంగా లేడీ గెటప్ తో సర్ ప్రైజ్ ఇచ్చాడు. దీనిని చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. మరో పుష్పరాజ్ లా ఉన్నావంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

భార్య, బిడ్డలతో నటుడు అజయ్..

దుబాయ్ వెకేషన్ లో అజయ్ ఫ్యామిలీ..

పొట్టేల్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..