దాహాంతో రిజ్వాన్ విలవిల.. వెళ్లి నీ ఆట ఆడుకోమంటూ షాకిచ్చిన అంపైర్లు

TV9 Telugu

16 October 2024

ముల్తాన్‌లో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు పాకిస్థాన్ 90 ఓవర్లలో 5 వికెట్లకు 259 పరుగులు చేసింది.

తొలిరోజు పాక్‌దే

ఈ మ్యాచ్‌లో మహ్మద్ రిజ్వాన్ విషయంలో తొలిరోజే వివాదం నెలకొంది. రిజ్వాన్‌ను నీళ్లు తాగకుండా అంపైర్లు అడ్డుకున్నారు.

రిజ్వాన్ విషయంలో వివాదం

72వ ఓవర్ తర్వాత మహ్మద్ రిజ్వాన్ నీళ్లు అడిగాడు. కానీ అంపైర్లు అందుకు అనుమతించలేదు. రిజ్వాన్‌కు నీళ్లు తాగకుండా ఆపేశారు.

అసలేమైంది?

మహ్మద్ రిజ్వాన్ నీళ్లు అడిగిన సమయం.. దాదాపు డ్రింక్స్‌కు ఒక ఓవర్ మాత్రమే ఉంది. దీంతో సమయం వృధా కాకుండా ఉండేందుకు అంపైర్లు ఇలా చేశారు. 

అంపైర్లు ఎందుకు ఇలా చేశారంటే

రిజ్వాన్ ముల్తాన్ టెస్టు తొలి రోజు 37 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 2వ రోజు 41 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు.

హాఫ్ సెంచరీకి చేయకుండానే ఔట్

ముల్తాన్ టెస్టు తొలి రోజు కమ్రాన్ గులామ్ 119 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. బాబర్ ప్లేస్‌లో వచ్చి, తొలి టెస్ట్‌లోనే శతకం బాదేశాడు.

కమ్రాన్ గులామ్ సెంచరీ

బాబర్ ఆజం స్థానంలో కమ్రాన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం దక్కింది. ఈ ఆటగాడు అరంగేట్రం టెస్టులోనే సెంచరీ సాధించాడు. 

బాబర్ స్థానంలో

ఓపెనర్ సామ్ అయ్యూబ్ తొలి ఇన్నింగ్స్‌లో 77 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కమ్రాన్ గులామ్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

సామ్ అయ్యూబ్ హాఫ్ సెంచరీ