రైలు కిటికీ నుంచి జారిపడ్డ చిన్నారి.. ఎక్కడ దొరికిందో తెలుసా ??
మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మథుర వెళ్లేందుకు ఓ కుటుంబం తమ 8 ఏళ్ల చిన్నారితో కలిసి రైలు ఎక్కింది. వీరు బోగీలోని ఎమర్జెన్సీ కిటికీ వద్ద ఉన్న సీట్లలో కూర్చుకున్నారు. వెంటిలేషన్ కోసం కొందరు ప్రయాణికులు ఈ విండోను తెరిచారు. మార్గమధ్యంలో ఆ బాలిక ఉన్నట్టుండి కిటికీ నుంచి జారి కిందపడిపోయింది. గమనించిన చిన్నారి తండ్రి వెంటనే లలిత్‌పుర్ రైల్వేస్టేషన్‌లో జీఆర్పీ పోలీసులను ఆశ్రయించారు.
అప్రమత్తమైన ఝాన్సీ జీఆర్పీ పోలీసులు.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌తో కలిసి గాలింపు చేపట్టారు. నాలుగు బృందాలుగా విడిపోయి రాత్రివేళ చిమ్మచీకట్లోనే 16 కిలోమీటర్ల మేర కాలినడకన గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే పట్టాల పక్కన ఉన్న ఓ చెట్ల పొదల్లో గాయాలతో స్పహకోల్పోయిన స్థితిలో బాలికను గుర్తించారు. ఆ ప్రాంతానికి రోడ్డు మార్గం లేకపోవడంతో అటుగా వెళ్తున్న గూడ్స్ రైలును ఆపి వెంటనే లలిత్‌పుర్‌కు తరలించారు. అక్కడ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. తన కుమార్తెను కాపాడిన రైల్వే పోలీసులకు ఆ పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మందుబాబు నిర్వాకం.. ఏం జరిగిందో చూడండి
తృటిలో తప్పిన పెను ప్రమాదం.. క్షణం ఆలస్యం అయ్యుంటే.. రైలు బ్లాస్ట్ అయిపోయేదే !!
Adah Sharma: సుశాంత్ ఉరేసుకున్న ఇంటికి షిఫ్ట్ అయిన అదా శర్మ
వామ్మో.. ఏంటా ఆవేశం.. కారును తుక్కు తుక్కు చేసిన ఏనుగు.. చివరకు ??
TOP 9 ET News: ఒక్క సాంగ్ కోసం రూ.20 కోట్లు !! | సంచలనం !! అప్పుడే రూ.900 కోట్ల బిజినెస్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

