మందుబాబు నిర్వాకం.. ఏం జరిగిందో చూడండి

మందుబాబు నిర్వాకం.. ఏం జరిగిందో చూడండి

|

Updated on: Oct 19, 2024 | 2:00 PM

మద్యం మనిషిని విచక్షణ కోల్పేయేలా చేస్తుంది. మద్యం మైకంలో వాళ్లేం చేస్తున్నారో, కనీసం ఎక్కడ ఉన్నారో కూడా తెలియనంతగా మారిపోతారు. తాజాగా ఫుల్‌గా మద్యం సేవించి ఇంటికి వెళ్లేందుకు నానా తిప్పలు పడిన ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి ఫుల్‌గా మందు కొట్టి లేవలేని స్థితిలో ఉన్నాడు.

అతన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు మరో వ్యక్తి బైకుపై వచ్చాడు. చివరకు ఎలాగోలా మందుబాబును బైకు ఎక్కించుకుని, వెనుక కూర్చోబెట్టుకున్నాడు. అంతవరకూ అంతా బాగానే ఉంది.. అప్పటికే ఫుల్‌ కిక్‌లో ఉన్న ఆ వ్యక్తి బైక్‌పై సరిగా కూర్చోలేకపోయాడు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బైకుపై కూర్చున్న అతను చూస్తుండగానే అమాంతం వెనక్కు వాలిపోయాడు. వాహనం నడుపుతున్న వ్యక్తి ఇదేమీ గమనించకుండా మెల్లగా ముందుకు వెళ్తున్నాడు. అంతే బైక్‌పై వెనక కూర్చున్న వ్యక్తి వెనక్కి వాలిపోయాడు. బైకు మరింత ముందుకెళ్లేందుకు ప్రయత్నించగా ఆ వ్యక్తి కిందపడిపోయాడు. బైకు తేలిగ్గా ఉందేంటా అని బైక్‌ నడుపుతున్న వ్యక్తి బైకు వెనక్కి చూసాడు. బండిపై మందుబాబు లేకపోవడంతో బైకును రోడ్డుపక్కన ఆపి అతన్ని పైకి లేపి కూర్చోబెట్టాలని చూసినా సాధ్యం కాలేదు. ఈ మందుబాబు ఇబ్బందులు చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఇదంతా వెనుక నుంచి గమనిస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటివకూ 5.71 లక్షలమందికి పైగా వీక్షించారు. 12 వేలమందికి పైగా లైక్‌ చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. క్షణం ఆలస్యం అయ్యుంటే.. రైలు బ్లాస్ట్‌ అయిపోయేదే !!

Adah Sharma: సుశాంత్ ఉరేసుకున్న ఇంటికి షిఫ్ట్ అయిన అదా శర్మ

వామ్మో.. ఏంటా ఆవేశం.. కారును తుక్కు తుక్కు చేసిన ఏనుగు.. చివరకు ??

TOP 9 ET News: ఒక్క సాంగ్‌ కోసం రూ.20 కోట్లు !! | సంచలనం !! అప్పుడే రూ.900 కోట్ల బిజినెస్‌

డెంగ్యూ వస్తే మేక పాలు తాగాలా ??

Follow us