డెంగ్యూ వస్తే మేక పాలు తాగాలా ??
ఇటీవలి కాలంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం వేల మంది డెంగ్యూ బారినపడుతున్నారు. డెంగ్యూ వ్యాధి బారిన పడుతున్నవారు త్వరగా కోలుకునేందుకు సరైన ఆహారం కీలకమని చెబుతున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. కొన్ని రకాల పండ్లు, కూరగాయల రసాలు ప్లేట్ లెట్స్ సంఖ్యను పెంచుతాయని.. రోగ నిరోధక శక్తిని బూస్ట్ చేస్తాయని చెప్తున్నారు.
అయితే, డెంగ్యూ బాధితులకు మేకపాలు మేలు చేస్తాయనే వార్తలు కూడా ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. డెంగ్యూ వ్యాధి చికిత్సలో మేక పాలు నిజంగా పనిచేస్తాయా..? ఈ పాలు.. డెంగ్యూని తగ్గించగలవా..? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.. మేక పాలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆవు పాలు మాదిరిగానే మేక పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. పోషకగుణాలు అధికంగా ఉండే ఈ పాలను తాగడం వల్ల పలు ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చునన్నది వారి మాట. ప్రొటీన్స్, కాల్షియం ఎక్కువగా ఉండే మేక పాలను తాగడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. మేక పాలల్లో అమినోయాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అన్ని సక్రమంగా అందుతాయి. ఇది ఆవు పాల కంటే ఎక్కువ ప్రోటీన్, అవసరమైన విటమిన్లు, తక్కువ లాక్టోస్ కలిగి ఉంటుంది, దీని కారణంగా ఇది సులభంగా జీర్ణమవుతుంది. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: తులం బంగారం రూ.లక్ష ?? పుత్తడి జోరుకు బ్రేకులు పడే ఛాన్స్ లేదా ??
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

