తులం బంగారం రూ.లక్ష ?? పుత్తడి జోరుకు బ్రేకులు పడే ఛాన్స్ లేదా ??
10 గ్రాముల బంగారం లక్ష రూపాయిలు. ఈ మాట వింటేనే గుండె కలుక్కుమంటుంది. వెంటనే ఇంట్లో మహిళల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. నేను అక్కడికీ కొనమని చెబుతూనే ఉన్నాను.. మీరే పట్టించుకోలేదు.. చూడండి.. ఇప్పుడు పది గ్రాముల బంగారం లక్ష రూపాయలు అవుతుందంట.. అన్న డైలాగులు భర్తలకు ఎదురవుతాయి. అయితే.. ఇప్పుడు దాని రేటు ఇంకా లక్ష రూపాయిలు అవ్వలేదు.
కానీ త్వరలో ఆ ముచ్చటా ఉంటుంది అంటున్నారు. నిపుణులు, ఆల్రెడీ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79 వేల మార్కును టచ్ చేసింది. ఇక ఇది దీపావళి, ధన్ తేరస్ వంటి పండుగల సీజన్. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తోంది. ఇంకేముంది.. పసిడి పరుగుకు కళ్లెం వేయడానికి అవకాశమే లేకుండా పోయింది. అంతర్జాతీయంగా చూస్తే.. ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం ఉంది. అటు చైనా ఏమో.. తైవాన్ ను భయపెడుతోంది. రష్యా-ఉక్రెయిన్ వార్ సంగతీ తెలిసిందే. ఇంకా అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా నవంబర్ నెలలో ఉన్నాయి. దాని ఫలితాలు కూడా స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపిస్తాయి. అంటే దేశీయంగా ఉన్న పరిస్థితులతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ, సామాజిక సంక్షోభాలు కూడా బంగారం ధరను అమాంతం పెంచేస్తున్నాయి. గత 20 ఏళ్లలో పుత్తడి ధర పెరిగిన తీరు చూస్తే.. బాబోయ్ అనాల్సిందే. అంతలా పెరిగిపోయింది. 2004లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు 6 వేల 300 వందలు. ఇప్పుడు దాదాపు 79 వేల రూపాయిలు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.రెండు వేల కోట్లా !! ఏంటి అంత సీన్ ఉందంటారా ??
UP నుంచి 1600km సైకిల్ తొక్కుకుంటూ.. బన్నీ అభిమాని డేర్ జర్నీ
టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న రవితేజ కూతురు.. ఇక దబిడి దిబిడే !!