TV9 Telugu
19 October 2024
న్యూజిలాండ్‌తో జరిగిన బెంగళూరు టెస్టులో టీమిండియా కేవలం 46 పరుగులకే ఆలౌట్ కావడంపై పలు విమర్శలు ఎదుర్కొన్నారు.
కానీ, ఈ ఒక్క ఇన్నింగ్స్ మినహా, టీమ్ ఇండియా ఈ ఏడాది మొత్తం టెస్ట్ క్రికెట్‌లో నిలకడగా అద్భుత ప్రదర్శన చేసింది. ప్రత్యేక రికార్డును కూడా సృష్టించింది.
బెంగళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా అద్భుతంగా పునరాగమనం చేసి 2024లో 100 సిక్స్‌లను పూర్తి చేసింది.
ఈ ఏడాది టెస్టు క్రికెట్‌లో 100 సిక్సర్లు కొట్టిన టీమ్ ఇండియా.. 147 ఏళ్ల చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది.
అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ (89) పేరిట ఉండేది. ప్రస్తుతం భారత్ ఈ రికార్డును తన పేరుతో లిఖించుకుంది. అలాగే కివీస్‌కు ధాటిగా సమాధానం ఇస్తోంది.
న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ వేసిన బంతిని బౌండరీ దాటిన విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి టీమ్ ఇండియా 100వ సిక్సర్ వచ్చింది.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మ్యాచ్ మూడో రోజు న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌటైంది. ఇందులో రచిన్ రవీంద్ర అద్భుత సెంచరీని నమోదు చేశాడు.
న్యూజిలాండ్ 356 పరుగుల ఆధిక్యం తర్వాత, టీమ్ ఇండియా బలమైన పునరాగమనం చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్, కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, పంత్ అర్ధ సెంచరీలు సాధించారు.