- Telugu News Entertainment India to Japan Prabhas 7 movies will be re release in theaters on his birthday
Prabhas Birthday: డార్లింగ్ సినిమాలు రీ రిలీజ్ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే.. పుట్టిరోజు వేడుకలకు సర్వం సిద్ధం..
ప్రభాస్.. ఈ పేరు వింటే చాలు పాన్ ఇండియా సినిమా పులకరించిపోతుంది. అలాంటి డార్లింగ్ పుట్టినరోజు అంటే ఓ రేంజ్ ఉంటుంది అన్నట్లుగా వేడుకలు జరగనున్నాయి. ఇండియా నుంచి జపాన్ వరకు ప్రభాస్ సినిమా రీ రిలీజ్లు సందడి చేయనున్నాయి. అక్టోబర్ 23న రెబెల్ స్టార్ పుట్టిరోజు సందర్బంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 7 సినిమాలు రీ రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. ఏంటా సినిమాలు.? ఏది ఎక్కడ.?
Updated on: Oct 19, 2024 | 3:57 PM

ముందుగా తెలుగు రాష్ట్రాల్లో డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా మూడు సినిమాలు రీ రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో మొదటిది ప్రభాస్ డెబ్యూ మూవీ ఈశ్వర్ అక్టోబర్ 22న మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాతోనే శ్రీదేవి కథానాయకిగా కెరీర్ మొదలుపెట్టుంది.

ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సి పన్ను జంటగా తెరకెక్కిన మిస్టర్ పర్‌ఫెక్ట్ కూడా మరోసారి అక్టోబర్ 22న విడుదల కానుంది. అలాగే గత ఏడాది డిసెంబర్ బ్లాక్ బస్టర్ సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్ కూడా మరోసరి సందడి చేయనుంది.

కర్ణాటకలో రెండు సినిమాలు రీ రిలీజ్కు రెడీ అయ్యాయి. వాటిలో ఒకటి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ఛత్రపతి. మరొకటి ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇక్కడ మరోసారి సందడి చేయనున్నాయి.

గుజరాత్లో కూడా ప్రభాస్ పుట్టిరాజు పురస్కరించుకొని ఓ బ్లాక్ బస్టర్ చిత్రం థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. అదే కొరటాల శివ దర్శకుడిగా డెబ్యూ ఇచ్చిన మిర్చి. ఇందులో అనుష్క శెట్టి, రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్స్. సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు.

ఇండియాలోనే కాదు.. జపాన్లో కూడా పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు హావ నడుస్తుంది. ఇక్కడ కూడా రెండు సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. వాటిలో ఒకటి యాక్షన్ ఎంటర్టైనర్ సాహూ, మరొకటి రొమాంటిక్ మూవీ రాధేశ్యామ్.




