Watch: తవ్వకాలలో బయటపడ్డ హనుమాన్ విగ్రహం.. తన్మయత్వంతో భక్తుల పూజలు..!
హనుమకొండలో ఓ శివాలయం అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జరిపిన తవ్వకాల్లో బాల హనుమాన్ విగ్రహం బయటపడింది. దీంతో స్థానికులు తరలివచ్చి హనుమంతుని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
హనుమకొండ హంటర్ రోడ్‌లో తవ్వకాల్లో పురాతన కాలంనాటి బాల హనుమాన్ విగ్రహం బయట పడింది. శివాలయం అభివృద్ధి పనులు నిర్వహిస్తున్న చోట హనుమాన్ విగ్రహం బయటపడటంతో స్థానికులు భక్తిపారవశ్యంతో ఉప్పొంగి పోతున్నారు. ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే బాల హనుమాన్‌కు గుడి కట్టిస్తామంటున్నారు.
మరిన్ని వివరాల్లోకి వెళ్తే.. హంటర్ రోడ్‌లోని అభయాంజనేయ స్వామి కాలనీలోని శివాలయంలో గత కొన్ని రోజులుగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పక్కనే ఉన్న గుట్టలను తొలగిస్తుండగా రెండు రాళ్ల మధ్యలో బాల ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యక్షం అయ్యింది.
ఆ నోట ఈ నోట ఈ విగ్రహం మాట కాలనీ అంతా విస్తరించడంతో కాలనీ వాసులు తాండోపతాండలుగా అక్కడికి చేరుకొని పూజాలు చేస్తున్నారు. బాల ఆంజనేయస్వామి ప్రత్యక్షం వెలవడం శుభసూచకం అంటున్న స్థానికులు, అక్కడే గుడికట్టి నిత్యపూజలు జరుపుతామని అంటున్నారు.