TOP 9 ET: OG నుంచి బయటికొచ్చిన దిమ్మతిరిగే పోస్టర్ | ప్రౌడ్ మూమెంట్.! గిన్నిస్ బుక్ లో చిరు స్టోరీ..

TOP 9 ET: OG నుంచి బయటికొచ్చిన దిమ్మతిరిగే పోస్టర్ | ప్రౌడ్ మూమెంట్.! గిన్నిస్ బుక్ లో చిరు స్టోరీ..

Anil kumar poka

|

Updated on: Oct 20, 2024 | 11:07 AM

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో అయన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ వార్ 2. తారక్ ఉన్నారు కాబట్టి తెలుగులోనూ ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉంటాయి. ఇదిలా ఉంటే తెలుగులో ఈ సినిమాకు వార్ 2 కాకుండా మరో టైటిల్ కూడా పెడుతున్నట్లు తెలుస్తుంది. యుద్ధ భూమి అనే పేరు పరిశీలిస్తున్నారు. ఆ మధ్య ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు హృతిక్ కూడా యుద్ధ భూమి అనే ట్వీట్ చేసారు.

01.OG: OG నుంచి బయటికొచ్చిన దిమ్మతిరిగే పోస్టర్.!

నిన్న కాక మొన్నే ఓజీ సినిమా షూట్ బిగిన్స్ అనే అప్డేట్ బయటికి వచ్చింది. అది కాస్తా పవన్‌ ఫ్యాన్స్‌ను క్లౌడ్‌ నైన్‌కి రీచ్‌ అయ్యేలా చేసింది. ఇక ఇప్పుడు ఆ హైప్‌ని మరింత గా పెంచేందుకే అన్నట్టు.. ఈ మూవీ నుంచి ఓ బ్యానర్ పోస్టర్ రిలీజ్ అయింది. ఎక్లూసివ్ బిగినింగ్.. ఎండ్ లెస్ డిస్ట్రక్షన్స్ టెక్ట్స్‌తో పవన్‌ పవర్‌ ఫుల్ షాడో పోస్టర్‌ను వదిలింది ఓజీ టీం.

02.chiru: ప్రౌడ్ మూమెంట్.! గిన్నిస్ బుక్ మ్యాగజీన్‌లో.. మెగాస్టార్ స్టోరీ.

తెలుగు వాళ్లకు మరో ప్రౌడ్ మూమెంట్‌ను మిగిల్చారు మెగాస్టార్ చిరు. ఇప్పటికే గిన్నిస్ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చిరు పేరు నమోదైంది. ఇక ఈ క్రమంలోనే గిన్నిస్ బుక్ అఫీషియల్ బుక్‌లో ఆయనకంటూ ఓ పేజ్ క్రియేట్ అయింది. మెగాస్టార్ చిరు గురించి అందులో ఓ స్టోరీ పబ్లిష్ అయింది. ఇప్పుడు ఇదే వరల్డ్ వైడ్ హాట్ టాపిక్ అవుతోంది. తెలుగు వాళ్లను గర్వించేలా చేస్తోంది.

03.boyapati: చిరు – బాలయ్య కాంబోపై బోయపాటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

బాలయ్య – నా కాంబినేషన్లో.. సినిమా స్టోరీ రెడీ చేయ్‌ బోయపాటి.. అని చిరు చెప్పడే ఆలస్యం.. అప్పుడే పని మొదలెట్టినట్టు ఉన్నారు బోయపాటి శ్రీను. ఇక తాజాగా ఇదే కాంబో పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. చిరు – బాలయ్య ను ఎదురుగా పెట్టుకుని స్టోరీ రాయకపోతే మేము వేస్ట్ అంటూ.. చెప్పాడు. తన ముసి ముసి నవ్వులతో.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి సీరియస్ గా పని మొదలెట్టినట్టు హింట్ ఇచ్చారు. తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు ఈయన .

04.war: ఇక నుంచి వార్ 2 కాదు.. యుద్ధ భూమి.

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో అయన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ వార్ 2. తారక్ ఉన్నారు కాబట్టి తెలుగులోనూ ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉంటాయి. ఇదిలా ఉంటే తెలుగులో ఈ సినిమాకు వార్ 2 కాకుండా మరో టైటిల్ కూడా పెడుతున్నట్లు తెలుస్తుంది. యుద్ధ భూమి అనే పేరు పరిశీలిస్తున్నారు. ఆ మధ్య ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు హృతిక్ కూడా యుద్ధ భూమి అనే ట్వీట్ చేసారు.

05.renu desai: చండీ హోమంలో పవన్‌ కొడుకు అకీరా, రేణు దేశాయ్‌.!

ఎప్పుడు సామాజిక కార్యక్రమాలతో.. సోషల్ మీడియా పోస్టులతో బిజీగా ఉండే రేణు దేశాయ్‌.. ఇప్పుడు చండీ హోమం చేస్తూ కనిపించారు. ఒక్కరేణు దేశాయ్‌ మాత్రమే కాదు.. పంచకట్టులో.. పవన్‌ కొడుకు అకీరా.. కూడా కనిపించారు. హోమ క్రతువు ముగిసే వరకు.. నిష్టగా తల్లితోపాటే కూర్చుకున్నారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో రేణు దేశాయ్‌ తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో.. ఇప్పుడా వీడియో.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అందర్నీ ఆకట్టుకుంటూనే మెగా ఫ్యాన్స్‌ సర్కిల్లో సర్కులేట్ అవుతోంది.

06. Venkatesh: వెంకటేష్‌ కోసం నితిన్ రిస్క్‌ చేస్తున్నాడా?

ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తున్న నితిన్.. మరో వైపు ప్రొడ్యూసర్‌గా రిస్క్ చేస్తున్నారు. సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే.. వరుస సినిమాలు చేస్తూ.. స్టిల్ టాలీవుడ్‌ లో దూసుకుపోతున్న వెంకీతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈయన నటిస్తున్న సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. దీని తర్వాత తమిళ దర్శకుడు టిఎన్ సంతోష్ దర్శకత్వంలో .. నితిన్ ప్రొడక్షన్ లో ఓ సినిమా చేయాలని చూస్తున్నారట వెంకీ.

07.Samantha: సమంతతో పని చేయొద్దని చెప్పారు (వరుణ్ దావన్ మాట్లాడుతున్న పిక్, సమంత సాడ్ పిక్)

సమంత ప్రస్తుతం తెలుగు కంటే హిందీపైనే ఎక్కువగా ఫోకస్ చేసారు. అక్కడ ఆమె నటిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది. తాజాగా ఈ సిరీస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు దర్శక నిర్మాతలు. అందులో హీరో వరుణ్ ధావన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు. సమంతతో వర్క్ చేయొద్దని కొందరు చెప్పారని.. తాను అవన్నీ పట్టించుకోలేదన్నారు వరుణ్.

08.salman: తప్పు చేయలేదు.. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు (సల్మాన్ సీరియస్ పిక్, మరో వైపు బిష్టోష్ )

తమ ఆరాధ్య దైవం అయిన కృష్ణ జింకను చంపినందుకే సల్మాన్ ఖాన్ పై బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు కోపం వచ్చిందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బిష్ణోయ్ కమ్యూనిటీకి క్షపాపణ చెబితే.. సల్మాన్‌ను చంపేది గురించి ఆలోచిస్తామని.. ఆ వర్గం నేతల నుంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక ఈక్రమంలోనే ఈ కామెంట్స్ పై సీరియస్ రిప్లై ఇచ్చారు సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్. తన కొడుకు సల్మాన్ కృష్ణ జింకల్నీ కాదు కదా.. బొద్దింకల్ని కూడా చంపలేదని.. చెప్పారు. అలాంటిది తామెందుకు సారీ చెప్పాలంటూ ప్రశ్నించాడు. క్షమించమని అడిగే ప్రసక్తే లేదన్నాడు. సల్మాన్‌కు జంతువులంటే.. ఇష్టమని.. తన పెంపుడు కుక్క చనిపోతే రోజుల తరబడి ఏడ్చాడని.. చెప్పారు సలీమ్.

09.salman: సల్మాన్ చుట్టు.. రూ.3 కోట్ల భద్రతా వలయం.

సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షూటింగ్ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది యూనిట్‌. దాదాపు 60 మందితో ఆయనకు భద్రత కల్పిస్తోంది. బయటి వ్యక్తులను సెట్‌లోకి అనుమతించటం లేదు. ఇంటి వద్ద కూడా.. సల్మాన్‌కు ప్రభుత్వం వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది. ఇక Y+ కేటగిరీలో మొత్తం 11 మంది సెక్యూరిటీ గార్డులు ఉంటారు. సల్మాన్ తో పాటు అతని ఇంటికి కూడా శిక్షణ పొందిన సాయుధ కానిస్టేబుల్స్ ఉంటారు. అలాగే నటుడికి ఎస్కార్ట్‌ వాహనం కూడా ఏర్పాటు చేశారు.ఇక ఓ రిపోర్ట్ ప్రకారం సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ ఖర్చు కోట్లలో ఉంటుందట. వై ప్లస్ సెక్యూరిటీకి ఏడాదికి దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Oct 20, 2024 08:50 AM